Chandrababu : డ్రగ్స్, అశ్లీల నృత్యాలు, క్యాసినో కల్చర్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉంది-చంద్రబాబు

టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే, వైసీపీ హయాంలో క్యాసినో, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో..

Chandrababu : డ్రగ్స్, అశ్లీల నృత్యాలు, క్యాసినో కల్చర్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉంది-చంద్రబాబు

Chandrababu

Chandrababu : కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించడంపై రాజకీయ రగడ జరుగుతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోవాను తలపించేలా భారీ సెట్ వేసి రంగు రంగుల లైట్లలో డీజే, రికార్డింగ్ డ్యాన్సులు చేయటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. స్పెషల్ ఎఫెక్ట్ గా చీర్ గాల్స్ తో డ్యాన్సులు చేయించారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే, వైసీపీ హయాంలో క్యాసినో కల్చర్, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మండిపడ్డారు.

Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?

మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, నరసరావుపేటలో టీడీపీ ఇంచార్జి అరవింద బాబుపై దాడిని చంద్రబాబు ప్రస్తావించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Indian Army: ఇండియన్ ఆర్మీ “యూనిఫామ్” గురించి 5 ఆసక్తికర అంశాలు

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ ఆరోపణలు చేసింది. సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారని.. గోవాను మించిపోయేలా కేసినో ఏర్పాటు చేశారని ఆరోపించారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆ వీడియోలను ట్వీట్ చేసి మరీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

‘గుడివాడలో యథేచ్ఛగా సాగుతున్న గడ్డం గ్యాంగ్ గ్యాంబ్లింగ్. గోవాను తలదన్నే రీతిలో “క్యాసినో” ఏర్పాటు చేసిన మండపం ఎవరిది? ధాన్యానికి మద్దతు ధర లేక, అమ్మిన వాటికి డబ్బులు రాక రైతులు సంక్రాంతికి దూరమైతే.. నయా దందాతో కోట్లు కొల్లగొడుతున్న మీ బూతుల మంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ట్యాగ్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా.