YS Viveka case : బెయిల్‌పై మరోసారి ఉదయ్ కుమార్‌రెడ్డికి ఝలక్ .. వివేకా డైరీని కోర్టుకు సమర్పించిన సీబీఐ

మరోసారి ఉదయ్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ సీబీఐ కోర్టును కోరింది.

YS Viveka case : బెయిల్‌పై మరోసారి ఉదయ్ కుమార్‌రెడ్డికి ఝలక్ ..  వివేకా డైరీని కోర్టుకు సమర్పించిన సీబీఐ

YS Viveka Case

YS Viveka case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను మరోసారి పొడిగిస్తు నిన్న సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డి తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈక్రమంలో ఈరోజు (మే11,2023) మరోసారి ఉదయ్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై ఈరోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయ్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ సీబీఐ కోర్టును కోరింది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఉదయ్ ప్రమేయం ఉందని నిర్ధారించుకున్నతరువాతనే అరెస్ట్ చేశామని దానికి తగిన ఆధారాలు సేకరించినతరువాతనే అరెస్ట్ చేశామని తెలిపింది.

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ మరోసారి పొడిగింపు

అంతేకాదు ఈకేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్ లో సీబీఐ మరోసారి పునరుద్ఘాటిస్తు స్పష్టంచేసింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు మరోసారి ఉదయ్ కు బెయిల్ పిటీషన్ పై ఉత్తర్వులను మే 15కు వాయిదా వేసింది. కాగా..ఈ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు.

కాగా..ఈ కేసులో అత్యంత కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు అవినాశ్ అరెస్ట్ పై గ్రీన్ సిగ్నల్ ఇఛ్చినా..హైకోర్టు అభ్యంతరాన్ని తొలగించినా ఇంకా అవినాశ్ అరెస్ట్ చేయకపోవటం సీబీఐపై కూడా విమర్శలు వస్తున్నాయి.