ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన!

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 08:34 PM IST
ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన!

Indo-Bharat Thermal power limited : ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన జారీ చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రూ.826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి.



సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ప్రైవేటు కంపెనీపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వెల్లడించింది. హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో సోదాలు జరిపినట్టు తెలిపింది. కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది.



ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. ఉదయం నుంచి కొనసాగుతున్నసోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.