టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలపై సీబీఐ విచారణ, ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో

  • Edited By: naveen , June 11, 2020 / 08:27 AM IST
టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలపై సీబీఐ విచారణ, ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై సీబీఐ విచారణకు కేబినెట్ నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ నిర్ణయం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. గురువారం(జూన్ 11,2020) సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై చర్చించారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
* ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల ఆర్థిక సాయం
* ఆగస్టు 12న పథకం ప్రారంభించనున్న సీఎం జగన్
* భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
* ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ణయం
* రామాయపట్నం పోర్టుకు ఆగస్టుకల్లా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం
* జూన్ 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కేబినెట్ నిర్ణయం
* గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేబినెట్ లో కీలక నిర్ణయాలు
* ఏపీ ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకపై సబ్ కమిటీ నివేదిక
* నివేదిక ఆధారంగా అక్రమాలపై సీబీఐకి దర్యాఫ్తు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం

Read: పిచ్చివాడిగా ముద్ర వేసి చంపాలనుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన డాక్టర్ సుధాకర్