Lakshmi Narayana : వెధవల్లారా.. సిగ్గుందా..మీ వల్లే దేశం ఇలా ఉంది.. విద్యార్థులపై ఆగ్రహంతో ఊగిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. పట్టరాని కోపం కనిపించింది. వెధవల్లారా, సిగ్గు లేదా అంటూ నిప్పులు చెరిగారు. మీ వల్లే దేశం ఇలా ఉంది అంటూ విద్యార్థులపై విరుచుకుపడ్డారు.

Lakshmi Narayana : వెధవల్లారా.. సిగ్గుందా..మీ వల్లే దేశం ఇలా ఉంది.. విద్యార్థులపై ఆగ్రహంతో ఊగిపోయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Lakshmi Narayana : లక్ష్మీనారాయణ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. సీబీఐ జేడీగా తనదైన ముద్ర వేశారు. ఐపీఎస్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి కూడా వచ్చారు. కాగా, లక్ష్మీనారాయణ సాధారణంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎప్పుడూ చిరు నవ్వు చిందిస్తూ ఉంటారు.

ఆయనను కోపంగా చూసిన సందర్భాలు, ఆయన ఆవేశంగా మాట్లాడిన సందర్భాలు చాలా చాలా తక్కువ. చాలావరకు ఆయన కూల్ గానే ఉంటారు. కానీ, ఫస్ట్ టైమ్.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనలో పట్టరాని కోపం కనిపించింది. వెధవల్లారా, సిగ్గు లేదా అంటూ నిప్పులు చెరిగారు. మీ వల్లే దేశం ఇలా ఉంది అంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన అంతలా ఫైర్ అయ్యింది ఎవరి మీదో తెలుసా.. విద్యార్థుల మీద.

అవును.. లక్ష్మీనారాయణకు కోపం వచ్చింది. పట్టరాని ఆగ్రహంతో ఆయన ఊగిపోయారు. విద్యార్థులను చెడామడా తిట్టేశారు. అసలేం జరిగిందంటే.. దేశభక్తి గురించి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఈలలు వేసిన విద్యార్థులపై లక్ష్మీనారాయణ సీరియస్ అయ్యారు. నల్గొండలో జరిగిన జనగణమన ఉత్సవ సమితి ద్వితీయ వార్షికోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థిని దేశ భక్తి గురించి మాట్లాడుతుండగా.. పలువురు విద్యార్థులు ఈలలు వేశారు. పిచ్చి కూతలు కూశారు. గోల గోల చేశారు. న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సభను డిస్ట్రబ్ చేశారు. అంతే, లక్ష్మీనారాయణకు పిచ్చ కోపం వచ్చింది. పోకిరీల తీరు పట్ల ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కాసేపు ఓపిక పట్టిన ఆయన తర్వాత బరస్ట్ అయ్యారు. వారిని చెడామడా తిట్టేశారు. సభ నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. చెయ్యి చూపిస్తూ, వేలు చూపిస్తూ, వార్నింగ్ ఇస్తూ.. ఆ పోకిరీల దుమ్ము దులిపేశారు లక్ష్మీనారాయణ.

”దేశభక్తి గురించి మాట్లాడుతుంటే చిల్లరగా మాట్లాడతాడా? ఎవడ్రా వాడు. దమ్ముంటే బయటికి రా. సిగ్గు శరం లేకుండా కూర్చున్నారు. ఇట్లాంటి వాళ్లు ఉండబట్టే దేశం ఇలా ఉంది. అమ్మాయిల వెనుక వరుసలో కూర్చున్న వారు చాలా అల్లరి చేశారు. ఇందాకటి నుంచి చూస్తున్నా. మీ లాంటి వాళ్లకు దేశభక్తి గురించి చెప్పాలంటే మాకు సిగ్గుగా ఉంది. దేశం పట్ల అభిమానం లేని మీరెందుకు ఇక్కడ? పోండి.. అసలు విద్యార్థుల్లా ఉన్నారా మీరు. ఆ డ్రెస్ చూడండి. హెయిర్ స్టైల్ చూడండి.. ఏం సాధించారని ఇంత గర్వపడుతున్నారు? ” అంటూ పోకిరీలపై నిప్పులు చెరిగారు లక్ష్మీనారాయణ. చూస్తుంటే.. విద్యార్థుల ప్రవర్తన ఆయనను బాగా బాధించినట్లు అర్థమవుతోంది.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ జేడీ లక్ష్మీనారాయణను అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెల్యూట్ చెబుతున్నారు. ఈ సమాజానికి కావాల్సింది మీలాంటి వారే అని కితాబిస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పోకిరీలకు బుద్ధి చెప్పాల్సిందేనని, వారిని సన్మార్గంలో పెట్టాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. బుద్ధి చెప్పే వారు, తప్పు సరిదిద్దే వారు లేకపోవడంతోనే విద్యార్థులు దారి తప్పుతున్నారని అభిప్రాయపడ్డారు.