Viveka murder Case : చెప్పులు అమ్ముకొనే వారిపై సీబీ ‘ఐ’

  • Published By: madhu ,Published On : September 28, 2020 / 12:38 PM IST
Viveka murder Case : చెప్పులు అమ్ముకొనే వారిపై సీబీ ‘ఐ’

Viveka murder case : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని ఈ కేసులో విచారించింది. దీంతో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన నలుగురు చెప్పుల డీలర్లకు ఈ కేసుతో సంబంధమున్నట్టు సీబీఐ భావిస్తోంది. దీంతో చెప్పుల షాపుల డీలర్లను కడప జైల్‌లో విచారించింది.




నలుగురిని వేర్వేరుగా విచారించింది. ఇటీవలే చెప్పుల షాపు మరో నిర్వాహకుడు మున్నాను విచారించిన సీబీఐ అధికారులు.. అతనికి చెందిన బ్యాంకులో భారీ మొత్తాన్ని గుర్తించారు. 48 లక్షల నగదు ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు.. ఆ మొత్తాన్ని సీజ్‌ చేశారు. సీబీఐ మరికొంత మందిని విచారించనుంది.

మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పులివెందులకు చెందిన ఏడుగురిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనుమానితుడిగా భావిస్తున్న చెప్పుల వ్యాపారి మున్నా బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.




అతని లాకర్‌లో 48 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మున్నాపై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చెప్పుల షాప్‌ యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. చెప్పుల షాపు యజమాని మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ.48 లక్షల డబ్బు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

మరికొన్ని బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు సీబీఐ తేల్చింది. భార్యాభర్తల వ్యవహారంలో చెప్పుల వ్యాపారి మున్నాను అప్పట్లో వైఎస్ వివేకా మందలించినట్లు తెలిసింది.
2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.




ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు మాత్రం దొరకలేదు.