YS Viveka case : వివేకా కేసులో అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.

YS Viveka case : వివేకా కేసులో అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ

Key Twist in YS Viveka Case.. YS Avinash Reddy

YS Viveka Case..YS Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. ఈ విషయాన్ని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. శుక్రవారం (జూన్ 9,2023)న అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిట్ పిటీషన్ పై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈక్రమంలో సీబీఐ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు అంటూ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది. దీంట్లో ప్రధమంగా అవినాశ్ రెడ్డిని ఎనిమిదవ నిందుతుడిగా పేర్కొంది.

సీబీఐ కౌంటర్ పిటీషన్ లో అంశాలు..
8వ నిందుతుడి అవినాశ్ రెడ్డి
హత్యకు కుట్ర, సాక్ష్యాలు చెరిపివేతలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంది..
దర్యాప్తును పక్కదారి పట్టించేలా అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి యత్నాలు..
వివేకా హత్యకు కుట్ర,సాక్ష్యాల ధ్వంసంపై కొనసాగుతున్న దర్యాప్తు
ఎన్.శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాశ్ రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారు..
ఉదయం 5.20కు ముందే అవినాశ్ రెడ్డి శివశంకర్ రెడ్డితో మాట్లాడాలరి దస్తగిరి వాంగ్ముల ఇచ్చారు..
కేసు పెట్టొద్దని,పోస్టు మార్టం నిర్వహించొద్దని సీఐ శంకరయ్యకు అవినాశ్, శివశంకర్ రెడ్డి చెప్పారు..
సీబీఐకి,కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని శంకరయ్యకు అవినాశ్ ప్రలోభ పెట్టే యత్నం..
దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివశంకర్ రెడ్డి యత్నించారు..

 

కాగా వివేకా హత్య కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి చంచల్ గూడా జైలులో ఉన్నారు. ఆయనకు ఇటీవల అనారోగ్యంపాలయ్యారు. అదేకారణంతో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. మరోపక్క భాస్కర్ రెడ్డి భార్య, అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెను కొన్ని రోజులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

ఈక్రమంలో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన అవినాశ్ రెడ్డి తల్లి ఆస్పత్రిపాలవ్వటంతో హాజరుకాలేకపోయారు. ఈ విషయం సీబీఐకు సమాచారం అందించి తల్లి వద్దే ఆస్పత్రిలో ఉన్నారు. ఈక్రమంలోనే మరోసారి అవినాశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా సీబీఐ విచారణకు హాజరుకావాలని సూచిస్తు.. ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై రేపు విచారణ జరగాల్సి ఉండగా సీబీఐ ఈ కేసులో అవినాశ్ ను 8వ నిందితుడుగా చేర్చటంతో ఈకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.