YS Viveka Case : ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ .. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ

అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సీబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

YS Viveka Case CBI supreme court : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka case)లో వైఎస్ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ బుధవారం బెయిల్ మంజూరు చేస్తు తుదితీర్పు వెలువరించింది.

దీంతో హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టులో సీబీఐ పిటీషన్ దాఖలు చేయనుంది. ఒకవేళ సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయకపోతే సునీతారెడ్డి మాత్రం సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించనున్నారు.

Viveka Case: తెలంగాణ హైకోర్టు‌లో అవినాశ్ రెడ్డి‌కి ఊరట.. హైకోర్టు వద్దకు కేఏ పాల్

కాగా ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. అవినాశ్ రెడ్డి లాయర్ వాదనలు పరిగణలోకి తీసుకున్నకోర్టు.. అతనికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, సీబీఐ విచారణ‌కు అవినాశ్‌ రెడ్డి సహకరించాలని ఆదేశించింది. అవినాశ్ రెడ్డి రూ.5 లక్షల షూరిటీ‌లు సమర్పించాలని, కేసు పూర్తి అయ్యేంత వరకు దేశం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని హైకోర్టు ఆదేశించింది.

Viveka Case: అవినాశ్ రెడ్డి‌పై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి.. సీబీఐపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ 30పేజీల ఆర్డర్‌లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాశ్ రెడ్డి‌పై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయని, సీబీఐ ఆధారాలను సేకరించలేక పోయిందని అభిప్రాయపడింది. సాక్షులను ప్రభావితం చేశారని అనడంలో ఆధారం లేదని, సాక్ష్యాలను తారుమారు చేశాడనడంలో ఎవిడెన్స్ లేవని పేర్కొన్న హైకోర్టు.. చెప్పుడు మాటలు ఆధారంగా దర్యాప్తు ఉందని సీబీఐపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తు ఊహాజనతమైన విచారణ మాత్రమే సాగిందని కోర్టు పేర్కొంది. దీంతో సీబీఐ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనుంది. సీబీఐ సుప్రీంకు వెళ్లకపోతే సునీతారెడ్డి మరోసారి సుప్రీంమెట్లెక్కనున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు