కొడుతూ, తిడుతూ, గుండు గీయిస్తూ… సీసీ టీవీ ఫుటేజ్‌లో అడ్డంగా దొరికిపోయిన నూతన్ నాయుడు భార్య మధుప్రియ..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 02:48 PM IST
కొడుతూ, తిడుతూ, గుండు గీయిస్తూ… సీసీ టీవీ ఫుటేజ్‌లో అడ్డంగా దొరికిపోయిన నూతన్ నాయుడు భార్య మధుప్రియ..

Nuthan Naidu’s House CC TV Footage: బిగ్‌బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్‌ నూతన నాయుడుపై శిరోముండనం(గుండు గీయించడం) ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నూతన నాయుడు తనను శిరోముండనం చేశారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు.


శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు నూతన్ నాయుడు భార్య మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి.
https://10tv.in/tamilnadu-police-men-appeal-to-yama-dharmaraja-for-extended-of-lifespan/
విచారణలో భాగంగా నూతన్ నాయుడు ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజ్‌‌ను పరిశీలించారు పోలీసులు. నూతన్ భార్య మధుప్రియ, శ్రీకాంత్‌ను విచక్షణారహితంగా కొట్టడం, గుండు కొట్టించడం అంతా కూడా రికార్డ్ అయింది. ఆమె కొడుతుండగా ఇతర సిబ్బంది సెల్ ఫోన్‌లో రికార్డ్ చేస్తుండడం విశేషం. ఇప్పుడు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా మధుప్రియ అడ్డంగా దొరికిపోయింది. మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.