Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. టీటీపీ ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుబాటు

కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. గతంలో టీడీపీ కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పింది.

Kapu Reservation Bill: కాపుల రిజర్వేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గతంలో టీడీపీ ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని అభిప్రాయపడింది.

Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐయానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించదని వివరించింది. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధమే అని కేంద్రం తేల్చింది. ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్ కల్పించడంలో కేంద్రం పాత్ర లేదని కేంద్ర సామాజిక న్యాయ శాఖ స్పష్టం చేసింది.

Covid-19: చైనాలో పెరుగుతున్న కోవిడ్.. ఇండియాకు ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందా?

103వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని కేంద్రం తేల్చి చెప్పింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని సూచించింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు