Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

Polavaram

Central Government key meeting : పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ అధికారులతో సమావేశం అయ్యారు. ఏపీ అధికారులతో సీడబ్ల్యుసీ, జలశక్తి అధికారులు భేటీ అయ్యారు. ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

రేపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో సీడబ్ల్యుసీ డామ్ డిజైనింగ్ కమిటీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై రేపు కీలక సమావేశం జరుగనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న అత్యంత ప్రాధాన్యం కలిగిన డిజైన్లపై డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) చైర్మన్‌ ఏబీ పాండ్యా అధ్యక్షతన సమావేశం జరుగనుంది.

Polavaram Project: పోలవరం అంశంలో ఏపీకి రూ.26వేల 585కోట్లు ఇవ్వాలి – కేంద్ర జలశక్తి శాఖ

దిగువ కాఫర్‌ డ్యాం, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌) డిజైన్లపై చర్చ జరుగనుంది. డయాఫ్రం వాల్‌ను నిర్మించిన ఎంతో అనుభవం ఉన్న ఎల్‌ అండ్‌ టీ, జర్మనీకి చెందిన బావర్‌ కంపెనీలు. 2020లో గోదావరిలో 23లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి డయాఫ్రం వాల్‌ చుట్టూ ఏర్పడ్డ సుడుల కారణంగా భారీ గొయ్యి ఏర్పడింది. దానిని పూడ్చే ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో డీడీఆర్‌పీ భేటీ కానున్నారు. ఇందులో కీలక డిజైన్లపై నిర్ణయం తీసుకుంటే.. పనులు ముందుకు సాగుతాయని.. లేదంటే ఎక్కడివక్కడ నిలిచిపోతాయని నిపుణులు చెబుతున్నాయి.