MANSAS Trust: న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యం -చంద్రబాబు

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వగా.. ట్రస్ట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలిందన్నారు.

MANSAS Trust: న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యం -చంద్రబాబు

Chandrababu: మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వగా.. ట్రస్ట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలిందన్నారు.

మాన్సాస్ విషయంలో ప్రభుత్వ చీకటి జీవోలను కొట్టేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎంకి చెంపపెట్టని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలని జగన్ రెడ్డి ఆలోచనకు చట్టం అడ్డుకట్ట వేసిందని అన్నారు.

అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని మరోసారి రుజువయ్యిందని అన్నారు. పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు.. వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిరంకుశ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి ఈ తీర్పుతోనైనా కనువిప్పు కలగాలి. అధికారులు గుడ్డిగా జీవోలివ్వడం మానుకోవాలని చంద్రబాబు అన్నారు.

మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్ర‌స్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంతో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయందే అంతిమ విజ‌యం అని మరోసారి స్పష్టం అయ్యిందని అన్నారు. అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌పై సింహాచ‌లం అప్ప‌న్న ఆశీస్సులు, ప్ర‌జాభిమానం, చ‌ట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజ‌యమిది అని అభిప్రాయపడ్డారు.