Chandrababu : పవన్ కల్యాణ్‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలుద్దాం, పోరాటం చేద్దాం-చంద్రబాబు

అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం.

Chandrababu : పవన్ కల్యాణ్‌కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. అందరం కలుద్దాం, పోరాటం చేద్దాం-చంద్రబాబు

Chandrababu : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులతో విపక్షాల గొంతు నొక్కుతోందన్నారు. తన జీవితంలో వైసీపీ లాంటి దారుణమైన పార్టీని చూడలేదన్నారు. 40 ఏళ్లుగా ఎప్పుడూ చూడని రాజకీయాలు చూస్తున్నా అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు కలిసి రావాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి అన్ని పార్టీలతో చర్చిస్తామన్నారు చంద్రబాబు.

విశాఖలో పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విజయవాడలో కలిశారు చంద్రబాబు. పవన్ కు సంఘీభావం తెలిపారు. గంట సేపు వీరిద్దరూ ఏకాంతంగా భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా చర్చలు జరిగాయి. అనంతరం ఇరువురూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు, పవన్ మీడియా ముందుకు కలిసికట్టుగా రావడం దాదాపు 8ఏళ్ల తర్వాత ఇదే.

విశాఖలో ప్రభుత్వం, పోలీసులు పవన్ తో వ్యవహరించిన తీరు దారుణం అని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ ఎయిర్ పోర్టుకి వచ్చినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు అనేక ఆంక్షలు పెట్టారని ఫైర్ అయ్యారు. పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు సీరియస్ అయ్యారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకే తాను పవన్ ను కలిశానని చంద్రబాబు వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పవన్ వైజాగ్ లో ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలు ఉండలేవు. పార్టీలు లేకపోతే ప్రజా సమస్యలపై మాట్లాడేదెవరు? అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అంతా ఆలోచన చేయాల్సిన సమయం ఇది. అంతా ఏకం కావాలి. అందరి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం. అందరం కలుద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. ప్రభుత్వానికి ఎదురు మాట్లాడితే కేసులు పెడుతున్నారు. మా వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. నా మనసు బాధపడటంతోనే పవన్ కు సంఘీభావం తెలిపా. వైసీపీ లాంటి దారుణమైన పార్టీని నా జీవితంలో చూడలేదు” అని చంద్రబాబు అన్నారు.

” ఏ పార్టీకైనా తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంటుంది. అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప వీళ్లకు తొత్తులుగా ఉంటే మీటింగ్ లు పెట్టుకోనిస్తారా? ఇలాంటి ధోరణులు చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా… అందరం కలుద్దాం.. కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం. ఇదే విషయాన్ని పవన్ తోనూ చర్చించా. ముందుగా కార్యాచరణ రూపొందించుకోగలిగితే, ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎలా పోటీ చేస్తారనేది వారే నిర్ణయించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం” అని చంద్రబాబు అన్నారు.