Ambati Rambabu: కోట్ల రూపాయలతో మా ఎమ్మెల్యేల్ని చంద్రబాబు కొన్నారు.. ఎవరు తప్పు చేసినా క్షమించం: అంబటి రాంబాబు

బేరసారాలు ఆడి, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతోనే ఇదంతా చేశారు. మావారిని రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు. యెల్లో మీడియాలో చంద్రబాబు వ్యూహం ఫలించిందని ఊదరగొట్టారు. సింబల్ మీద గెలిచిన సభ్యులు అమ్ముడుపోయు శునకానందం పొందారు.

Ambati Rambabu: కోట్ల రూపాయలతో మా ఎమ్మెల్యేల్ని చంద్రబాబు కొన్నారు.. ఎవరు తప్పు చేసినా క్షమించం: అంబటి రాంబాబు

Ambati Rambabu: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు కోట్ల రూపాయల ఆశ చూపి ప్రలోభపెట్టారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలు చేశారని అంబటి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఈ సందర్భంగా టీడీపీపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరు అప్రజాస్వామికంగా ఉంది. టీడీపీ సభ్యులు ఏ ఒక్క రోజు సస్పెండ్ కాకుండా లేరు. సస్పెన్షన్ ఆలస్యమైతే భరించలేక పోయారు. స్పీకర్‌పై దాడి చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే దాడి జరిగింది. కుట్రలు, కుతంత్రాలు, బేరాలాడటం కోసం టైమ్ వెచ్చించారు. బేరసారాలు ఆడి, ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలతోనే ఇదంతా చేశారు. మావారిని రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఇచ్చి ప్రలోభ పెట్టారు. యెల్లో మీడియాలో చంద్రబాబు వ్యూహం ఫలించిందని ఊదరగొట్టారు. సింబల్ మీద గెలిచిన సభ్యులు అమ్ముడుపోయు శునకానందం పొందారు. కొన ఊపిరితో వున్న పార్టీకి 4 సీట్లు రావడంతో గొప్పలు పోతున్నారు.

Viral Video: చాక్లెట్ల జడతో అలంకరించుకున్న పెళ్లి కూతురు.. చాక్లెట్లతోనే నగలు.. వైరల్ అవుతున్న వీడియో

ఎమ్మెల్యేల్ని పశువులను కొన్నట్లు కొన్నాడు. ప్రలోభాలకు గురైన వాళ్లు చంద్రబాబు చేతిలో మోసపోయి త్వరలో‌ మీడియాకు చెబుతారు. ఓటును అమ్ముకున్న దుర్మార్గులు వాళ్లు. వారిపై యాక్షన్ తీసుకున్నాం. ఎవరు తప్పు చేసినా పార్టీ క్షమించదు. నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశామంటున్నారు. నియమావళి ప్రకారమే సస్పెండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తాం. ఇల్లు అలకగానే పండుగ కాదు. దమ్ముంటే టీడీపీ నుండి వచ్చిన నలుగురిని చంద్రబాబును సస్పెండ్ చేయమనండి.

చంద్రబాబుని వ్యతిరేకించి ఆ నలుగురు బయటకు వచ్చారు. మా నలుగురు ఎమ్మెల్యేలకు సీట్లు లేవని జగన్ చెప్పారు. అందుకే వాళ్లు చంద్రబాబు వైపు వెళ్లారు. సింగిల్‌గా చంద్రబాబుని రమ్మనండి. వారాహి ఎందుకు? చంద్రబాబుకి దమ్ములేదా‌?’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.