టీడీపీని చంద్రబాబే మూసేస్తారు

టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 01:31 PM IST
టీడీపీని చంద్రబాబే మూసేస్తారు

టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.

టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలంగాణలో టీడీపీని మూసేశారని తెలిపారు. ఆంధ్రలో 90 శాతం మూసేశారని..ఇంకో 10 శాతం కూడా మూసేస్తారని చెప్పారు. టీడీపీని ఎవరికీ ఇవ్వరని.. ఆయనే సమాధి చేస్తారని అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు. బీరాలు పలకడంలో ఆయనను మించినోళ్లు లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడడానికి టీడీపీకీ అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణానికి అన్ని భూములు అవసరం లేదన్నారు. 10 టీవీ నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అమరావతి భూముల రికార్డులను టీడీపీ ప్రభుత్వం ట్యాంపర్‌ చేసిందని ఆరోపించారు. 

అమరావతిలో చంద్రబాబు పర్యటిస్తే తరిమి తరిమి కొడతారని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే అక్కడెందుకు టీడీపీ ఓడిపోయిందని ప్రశ్నించారు. అమరావతిపై ప్రేమ ఉంటే అక్కడ చంద్రబాబు ఇల్లెందుకు కట్టుకోలేదని నిలదీశారు. ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్ పోరాటం చేయలేదెందుకని ప్రశ్నించారు. 

మంత్రి పదవి దక్కాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదని.. మరికొన్ని సమీకరణాలు కలిసి రావాలన్నారు. తనతో పాటు మరికొంతమందికి మంత్రి పదవులు దక్కలేదని గుర్తు చేశారు. మంత్రి పదవి రాలేదని బాధపడలేదని తెలిపారు. మంత్రి పదవి రాలేదేంటని అందరూ అడిగితే బాధేసిందన్నారు. నియోజకవర్గంపై దృష్టి పెట్టడం వల్లే బయట కనిపించడం లేదని చెప్పారు. జగన్‌పై ఆరోపణలకు సమాధానం చెప్పడానికి మంత్రులున్నారని తెలిపారు. 

ఎమ్మెల్యే పదవి మాస్ మసాలాగా ఉంటుందని తెలిపారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. తనకు మంచి పదవినే జగన్‌ ఇచ్చారని చెప్పారు. ఓ ప్రెస్‌మీట్‌లో సరదాగా పప్పు అని అన్నానని, అది ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయిందన్నారు. లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యాడని విమర్శించారు. మంగళగిరిలో ఓడిపోయారని..ముఖ్యమంత్రి కొడుకునే చిత్తుగా ఓడించారని అన్నారు.

తనకూ, జగన్‌కు మధ్య గ్యాప్‌ ఏమీ రాలేదన్నారు. తన నియోజకవర్గానికి జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీనియర్లు ఇబ్బంది పడుతున్నారనే మీడియాకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణం అలవడుతుందన్నారు.