బడ్జెటంతా అంకెల గారడీ : చంద్రబాబు 

  • Published By: bheemraj ,Published On : June 16, 2020 / 09:30 PM IST
బడ్జెటంతా అంకెల గారడీ : చంద్రబాబు 

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మూల ధన వ్యయం సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. అరకొర బడ్జెట్ తో జలవనరుల ప్రాజెక్టులు ఎలా పూర్త చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు మాత్రమే చూపుతున్నారనీ ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కడా బడ్జెట్ లో చూపలేదన్నారు. మంగళవారం (జూన్ 16, 2020) అమరాతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో విధ్వంసానికి నాంది పలికారు తప్ప ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులతో ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు దేవుడు స్క్రిప్టు రాశాడని ఎమ్మెల్యేల వలసలపై చెప్పిన మాటలేంటి? ిఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్టు రాస్తున్నాడన్నది గుర్తు పెట్టుకోందన్నారు. 

గవర్నర్ ప్రసంగంలో శాంతిభద్రతల అంశం పెట్టకపోవడం పిరికితనం. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారిన బిల్లులు పెట్టేందుకే అసెంబ్లీ పెట్టారా?  అని నిలదీశారు. మోడీతో తనకు వ్యక్తి విభేదాలేమీ లేవన్నారు. రాష్ట్ర ప్రయోనాల కోసమే ఆనాడు పోరాడనని చెప్పారు. ప్రత్యేక ఇతర హామీలపై జగన్ చెప్పేందేంటీ, ఇప్పుడు చేసేదేంటీ అని ప్రశ్నించారు. 

తమ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని పార్టీలోకి రావాలని ప్రలోభాలు పెట్టి బెదిరించారని ఆరోపించారు. ఆయన లొంగనందుకు అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా మానవత్వం లేకుండా ప్రవర్తించారని తెలిపారు. అధికార దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పుదన్నారు. అనారోగ్యంగా ఉంటే ఉరిశిక్ష కూడా వేయరని..అలాంటిది అచ్చెన్నాయుడికి మళ్లీ శస్త్ర చికిత్స చేయించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. 

Read: జగన్ క్లారిటీ.. గవర్నర్ నోటి వెంట పరిపాలన రాజధానిగా విశాఖ