జగన్ నిర్ణయంతో ఏపీకి నష్టం… తెలంగాణకు లాభం

రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు..

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 11:03 AM IST
జగన్ నిర్ణయంతో ఏపీకి నష్టం… తెలంగాణకు లాభం

రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు..

రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆవేదనతో రగిలిపోతున్నారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అని నినదిస్తున్నారు. అమరావతినే కేపిటల్ గా కొనసాగించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ(జనవరి 13,2020) అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. పెనుకొండలో జోలె పట్టి విరాళాలు సేకరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.

సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. అభివృద్ధి ఆగిపోయిందన్నారు. మూడు రాజధానులతో నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జగన్ నిర్ణయంతో ఏపీకి నష్టం.. తెలంగాణకు లాభం కలుగుతోందన్నారు చంద్రబాబు. మూడు రాజధానులతో ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బాధపడ్డారని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వల్ల తమకే లాభం అంటూ తెలంగాణకు చెందిన ఓ మంత్రి అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మనల్ని చూసి తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారని చంద్రబాబు వాపోయారు. 

రాష్ట్రానికి ఒకటే రాజధాని.. అది అమరావతే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు ప్రజలంతా ఒప్పుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని విశాఖకు మారిస్తే రాయలసీమ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడతారని చంద్రబాబు వాపోయారు. రాయలసీమ నుంచి విశాఖకు వెళ్లాలంటే రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. విశాఖకు వెళ్లేందుకు రెండు రోజులు.. వచ్చేందుకు రెండు రోజులు పడుతుందన్నారు. జగన్ ది తుగ్లక్ పాలన అని చంద్రబాబు మండిపడ్డారు. రాయలసీమకు నేను అన్యాయం చేస్తున్నానని అంటున్నారని.. రాయలసీమకు కియా మోటార్స్ తెచ్చింది నేనే కదా అని చంద్రబాబు అన్నారు. తాను తెచ్చిన పరిశ్రమలు జగన్ వల్ల వెళ్లిపోయాయి అన్నారు.

చంద్రబాబు కామెంట్స్..
* జగన్ ది తుగ్లక్ పాలన
* జగన్ నిర్ణయంతో ఏపీకి నష్టం.. తెలంగాణకు లాభం
* ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి
* రాయలసీమ నుంచి విశాఖ వెళ్లాలంటే రెండు రోజులు పడుతుంది
* రాయలసీమకు నేను అన్యాయం చేస్తున్నానా.. రాయలసీమకు కియా మోటార్స్ తెచ్చింది నేనే
* నేను తెచ్చిన పరిశ్రమలు జగన్ వల్ల వెళ్లిపోయాయి

* రాయలసీమకు హైకోర్టు రావాలంటే కేంద్రం ఒప్పుకోవాలి
* రైతులను విమర్శిస్తున్న వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులు
* బంగారు గుడ్లు పెట్టే అమరావతిని ఎవరైనా చంపేస్తారా?
* వైసీపీ ఎమ్మెల్యే బూతులు మాట్లాడుతున్నారు
* ఆ మాటలు నేను, పవన్ కల్యాణ్ పడాలా..?
* అమరావతిని కాపాడుకోవడం అందరి బాధ్యత

Also Read : రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబు సంచలన స్టేట్ మెంట్