Chandrababu On Illicit Liquor : మద్యం కల్తీ బ్రాండ్లపై పోరాటం ఉధృతం చేస్తాం-చంద్రబాబు

ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. మద్యం కల్తీ బ్రాండ్లపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు.(Chandrababu On Illicit Liquor)

Chandrababu On Illicit Liquor : మద్యం కల్తీ బ్రాండ్లపై పోరాటం ఉధృతం చేస్తాం-చంద్రబాబు

Chandrababu On Illicit Liquor

Chandrababu On Illicit Liquor : వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ చూడలేదన్నారు. మద్యం కల్తీ బ్రాండ్లపై పోరాటం ఉధృతం చేస్తామన్న చంద్రబాబు, కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు టీడీపీని స్థాపించారని తెలిపారు. బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన పార్టీ… తెలుగుదేశం అని స్పష్టం చేశారు. టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని నిర్దేశించారు. రాష్ట్రానికి టీడీపీ అవసరం ఏంటో ప్రజలకు వివరించాలని చంద్రబాబు అన్నారు.(Chandrababu On Illicit Liquor)

Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ 40 వసంతాల లోగో ఆవిష్కరణ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు చంద్రబాబు. మద్యం బ్రాండ్ల అంశంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా జరగాలని అన్నారు. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్లు కనిపించడం లేదన్నారు. నాటుసారా తాగి 42 మంది చనిపోతే సహజ మరణాలు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మద్యం దోపిడీని ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు వెల్లడించారు. కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయిన చంద్రబాబు.. అయినా, కల్తీ మద్యం బ్రాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం బ్రాండ్లను అరికట్టే వరకు పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు మాట్లాడారు. పోలవరం పనులు పూర్తి చేయాలంటూ గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లామని తెలిపారు. పోలవరానికి కేంద్రం ఇస్తామంటున్న నిధులు చాలా తక్కువని, పోలవరంలో మిగతా రూ.40 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.

TDP Protest : ఏపీ అసెంబ్లీ, మండలిలో తాళిబొట్లతో టీడీపీ సభ్యుల నిరసన

పోలవరం ప్రాజెక్టు ఖర్చు, ఆర్ అండ్ ఆర్… మొత్తం కేంద్రానిదే బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ హయాంలో ప్రతివారం పోలవరం పనులు సమీక్షించామని వెల్లడించారు. డయాఫ్రం వాల్ గురించి తెలియకుండానే సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంలో డయాఫ్రం వాల్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. 2023లో పోలవరం నుంచి నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. పోలవరంపై సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు చంద్రబాబు.

YCP-TDP : ఏపీలో లిక్కర్‌ బ్రాండ్లపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్‌ వార్‌