కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై దాడి… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు Chandrababu లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..

కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై దాడి… రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు Chandrababu లేఖ

Chandrababu

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్ పత్రాలు చించివేశారని ఆరోపించారు. నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని వెల్లడించారు.

ఈ దాడిలో 30మంది వరకు పాల్గొని వెంకటేశ్ ను తీవ్రంగా కొట్టారని చంద్రబాబు వివరించారు. అతడి సెల్ ఫోన్ లాగేసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలన్నారు. స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు తన లేఖకు జతచేశారు.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్లు వేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ తరుఫున నామినేషన్ వేసేందుకు వెళుతుండగా అభ్యర్థి చేతిలోంచి నామినేషన్ పేపర్లను కొంతమంది వ్యక్తులు లాక్కుపోయారు. దాడి చేసిన మరీ పేపర్లను లాక్కుపోయారని బాధితుడు వాపోయాడు.

నామినేషన్లకు ఈరోజే చివరి రోజు. దీంతో ఆయా పార్టీల తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్‌ నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అతడి నుంచి కొంతమంది వ్యక్తులు నామినేషన్‌ పత్రాలు లాక్కుపోయారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వెంకటేశ్‌ చేతికి గాయమైంది.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

కాగా బాధితుడు వెంకటేశ్ గతంలో కుప్పం సర్పంచ్ గా, ఎంపిపిగా పని చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైపీసీ పోటీ పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ పురపాలిక ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పట్టు నిలుపుకోవాలని టీడీపీ, పాగా వేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి.