Chandrababu : 36 గంటల దీక్ష తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎవరెవరిని కలుస్తారంటే..

టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింప

Chandrababu : 36 గంటల దీక్ష తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎవరెవరిని కలుస్తారంటే..

Chandrababu Naidu

Chandrababu Naidu : టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. దీక్ష ముగించిన వెంటనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు.

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..కాల్ కట్ అయినా సులభంగా జాయిన్ కావొచ్చు

చంద్రబాబు సోమవారం(అక్టోబర్ 25,2021) ఢిల్లీలో పర్యటించనున్నారు. చంద్రబాబు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారైంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవనుంది.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్ష ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు. అధికార వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి భౌతిక దాడులకు దిగలేదని చంద్రబాబు అన్నారు. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని సిద్ధాంతం ప్రకారం ఓటర్ల దగ్గరకు వెళదామని సూచించారు. భౌతిక దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని, పోరాడకపోతే దాడులు పెరుగుతాయని చంద్రబాబు అన్నారు.

పోరాడే వారిపై కేసులు పెడతారని, అయినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు బాబు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నారని, మద్యం ధరలపై ట్వీట్ చేసిన యువకుడు ఆరు రోజుల తర్వాత శవమై కనిపించాడని.. అతడి మృతిపై విచారణ చేయమని పోలీసులకు లేఖ రాస్తే తిరిగి వాళ్ళు తనకు లవ్ లెటర్ రాశారని చంద్రబాబు మండిపడ్డారు.

పోలవరం నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని, ప్రాజెక్టు పనులు నత్తనడక సాగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. కరెంటు చార్జీలు తగ్గిస్తా అన్న జగన్… ఇప్పుడు మోత మోగిస్తున్నాడని మండిపడ్డారు.