Chandrababu : స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలి-చంద్రబాబు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Chandrababu : స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలి-చంద్రబాబు

Chandrababu Schools

Chandrababu : కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు పొడిగించాలన్నారు చంద్రబాబు. ఇప్పటికే కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Obesity : స్థూలకాయానికి ఆహారంలో మార్పులతో పాటు..

వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, నరసరావుపేటలో టీడీపీ ఇంచార్జి అరవింద బాబుపై దాడిని చంద్రబాబు ప్రస్తావించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలని, నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే.. వైసీపీ హయాంలో క్యాసినో, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.

Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు

కాగా, స్కూల్స్ తెరవడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కరోనా వ్యాప్తికి, స్కూళ్లు తెరవటానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. విద్యార్థులు నష్టపోకూడదనే స్కూళ్లు తెరిచామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. అత్యవసర పరిస్థితి వస్తేనే స్కూళ్ల బంద్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు.