నేలపై కూర్చొన్న చంద్రబాబు, బతిమాలాడిన డీఎస్పీ..రేణిగుంటలో హై టెన్షన్

నేలపై కూర్చొన్న చంద్రబాబు, బతిమాలాడిన డీఎస్పీ..రేణిగుంటలో హై టెన్షన్

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ నేలపై కూర్చొన్నారు. ఇక్కడి నుంచి వెళ్లాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నోటీసులు తీసుకోవాలంటూ..డీఎస్పీ చెప్పారు. బాబును బతిమాలాడే ప్రయత్నం చేశారు. నేలపై బాబు కూర్చొవడంతో..ఆ డీఎస్పీ కూడా నేలపై కూర్చొని ఉన్న వీడియోలు, ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. సుమారు రెండు గంటల పాటు..పరిస్థితి కొనసాగడంతో రేణిగుంట విమానాశ్రయంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

గాంధీ విగ్రహం వద్ద వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ నిరసన చేపట్టేందుకు 2021, మార్చి 01వ తేదీ సోమవారం చిత్తూరుకు బాబు వచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆందోళనకు దిగాలని బాబు నిశ్చయించారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. చంద్రబాబు చిత్తూరు పర్యటన, నిరసన దీక్షకు అనుమతి లేదంటున్నారు చిత్తూరు పోలీసులు. కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో.. టీడీపీ అధినేత టూర్‌కు నో చెబుతున్నారు.

తనను అడ్డుకోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. శాంతియుతంగా..తాను గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళుతున్నానని, ఎందుకు అడ్డుకుంటారంటూ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం ఎక్కడా ప్రశ్నించారు. ఎస్పీని పిలిపిస్తామని పోలీసులు చెప్పారు. దీనిని బాబు నో చెప్పారు. బాబును అడ్డుకోవడంపై టీడీపీ తమ్ముళ్ళు కోపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిని ఎలా అడ్డుకుంటారని, ఎందుకు నిర్భందం చేశారని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును ఎండగడుతున్నారు. మొత్తానికి బాబు పర్యటన జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.