Chandrababu: కుప్పంలో దొంగ ఓట్లు వేయిస్తారా? అడుగడుగునా నీచ రాజకీయమేనా?

కుప్పం మున్సిపాలిటీ పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: కుప్పంలో దొంగ ఓట్లు వేయిస్తారా? అడుగడుగునా నీచ రాజకీయమేనా?

Chandrababu

Chandrababu: కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తారంటూ మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని, ఎప్పుడు ఎవరొచ్చి కొడతారా అనే భయంతో ప్రభుత్వంలోని పెద్దలు బతకాల్సి వస్తుందని అన్నారు. పోలీసులు కూడా అప్పుడు వారిని కాపాడలేరన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపైన ప్రజలు కూడా ఆలోచించాలని అన్నారు. దొంగ ఓట్లేస్తున్న వారిని చూసి వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారని అన్నారు చంద్రబాబు. పక్క రాష్ట్రాల నుంచి మనుషుల్ని తీసుకొచ్చి దొంగఓట్లు వేయిస్తూ సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు.

ఉపఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని తప్పుడు విధానాలకు వైసీపీ శ్రీకారం చుట్టిందని అన్నారు. అడుగడుగునా నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రతి సంఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు చంద్రబాబు. ఎన్నికలు నిర్వహించటం చేతకాకుంటే మావల్ల కాదని, ప్రభుత్వాన్నే ఎన్నికల ప్రక్రియ నిర్వహించుకోమని ఎస్ఈసీ వెళ్లిపోవాలన్నారు.

Siddipet : సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా ?

ఎన్నికల సమయంలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి ఊడిగం చేయటం నేరమన్నారు చంద్రబాబు. నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎంపీలు, మేయర్లు పోలీంగ్ కేంద్రాల వద్దకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. అనధికార వాహనాలను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. ఎంతమందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారో సమాధానం చెప్పాలన్నారు.

Telugu Film Directors: దర్శకుల సంఘం కొత్త అధ్యక్షుడిగా విశ్వనాథ్

కుప్పంలో దొంగ ఓటర్లను తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుకున్నారని, ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అన్నారు చంద్రబాబు. ఫిర్యాదును పట్టించుకోకుండా టీడీపీ నేతలను అరెస్టు చేశారంటూ దుయ్యబట్టారు.