Chandrababu Slams Jagan : అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు.. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు

ఈ రాష్ట్ర ఆదాయం వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. జగన్ కుప్పంపై కక్ష కట్టాడు. వదిలి పెట్టం. (Chandrababu Slams Jagan)

Chandrababu Slams Jagan : అప్పుడు ముద్దులు.. ఇప్పుడు గుద్దులు.. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు

Chandrababu Slams Jagan

Chandrababu Slams Jagan : జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. వ్యంగాస్త్రాలు సంధించారు. ఆ రోజు ముద్దులే ముద్దులు.. ఇవాళ గుద్దులే గుద్దులే.. అంటూ జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. పక్కనే ఉండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోలు మన కన్నా తక్కువ అని చంద్రబాబు చెప్పారు. ఈ రాష్ట్ర ఆదాయం వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వాపోయారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. అనిగర క్రాస్ లో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

”గ్యాస్ ధరలు పెరిగాయి అయినా మీకు కోపం రావడం లేదు. జగన్ కుప్పంపై కక్ష కట్టాడు. మిమ్మల్ని వదిలి పెట్టం. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కరెంటు ఇవ్వలేని వాళ్లు బిల్లులు వేయచ్చా? ప్రజా వేదిక కూల్చి విధ్వంసానికి ఈ జగన్ నాంది పలికాడు” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.(Chandrababu Slams Jagan)

SomuVeerraju On Narayana Arrest : జగన్, బొత్సలలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? నారాయణ అరెస్ట్‌పై సోమువీర్రాజు స్పందన

”రైతు భరోసా కింద రూ.12వేల 500 ఇస్తానని చెప్పి 7వేల 500 ఇస్తున్నాడు. పుంగనూరు పుడింగి కొత్త బిక్షగాడు ఆరు నెలల్లో మీటర్లు పెడతారంట. మద్యం ఒకప్పుడు 60 రూపాయలు.. ఇపుడు జే బ్రాండ్ రూ.200లకు అమ్మి ప్రజల రక్తం తాగుతున్నారు. అమ్మఒడి ఇస్తున్నాడా? 95 శాతం హామీలు ఎక్కడ అమలయ్యాయి? రూ.8 లక్షల కోట్లు అప్పు చేశాడు. నారాయణ అధినేతను తప్పుడు ఆరోపణలు చేసి అరెస్ట్ చేయడం తప్పు కాదా? రాజకీయ కక్షతో నారాయణను అరెస్ట్ చేశారు. ఐఐటీ ర్యాకుల్లో రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తెచ్చిన నారాయణ సంస్థలను వీలైతే ప్రోత్సహించాలి. మానవత్వం లేని సీఎం జగన్” అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Chandrababu Slams YS Jagan Administration

Chandrababu Slams YS Jagan Administration

బుధ‌వారం నుంచి మూడు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్రబాబు ప‌ర్య‌టిస్తారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరు చేరుకున్నారు. బెంగ‌ళూరు నుంచి రోడ్డు మార్గం మీదుగా కుప్పం చేరుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కుప్పంతో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని శాంతిపురం, గుడిప‌ల్లె మండ‌లాల్లోనూ చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు.

Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం.. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్

విద్యుత్ చార్జీల‌తో పాటు ఆర్జీసీ చార్జీల‌ను పెంచడంపై జ‌గ‌న్ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ బాదుడే బాదుడు పేరిట టీడీపీ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Chandrababu Slams YS Jagan Administration

Chandrababu Slams YS Jagan Administration

Kodali Nani Comments: టీడీపీ, జనసేన, బీజేపీని మూటగట్టి బంగాళాఖాతంలో కలిపేస్తారు: కొడాలి నాని