Chandrababu Ukraine : సురక్షితంగా తీసుకొస్తాం.. యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రులకు చంద్రబాబు భరోసా

యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..

Chandrababu Ukraine : సురక్షితంగా తీసుకొస్తాం.. యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రులకు చంద్రబాబు భరోసా

Chandrababu

Chandrababu Ukraine : యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అక్కడి తెలుగు విద్యార్థులతో చంద్రబాబు జూమ్ లో సమావేశం అయ్యారు. తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు విద్యార్థులంతా ఐక్యంగా ఉండటంతో పాటు తటస్థంగా ఉండటం ఎంతో మంచిదన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకం అని చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని వారి సూచించారు చంద్రబాబు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు వారితో చెప్పారు.

రాబోయే 2-3 రోజులు ఎంతో కీలకం అన్న చంద్రబాబు.. పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరు ఎవరికీ లక్ష్యం కాదు కాబట్టి మీరు సురక్షితంగా ఉండొచ్చని చంద్రబాబు వారితో అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి మీ యోగక్షేమాల కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు.

CM Jagan : యుక్రెయిన్‌లోని తెలుగు వారి కోసం అధికారుల‌ను నియ‌మించిన సీఎం జగన్

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది తెలుగువారు యుక్రెయిన్ లో చిక్కుకుపోయారు. భారత్ కు తిరిగి వచ్చే పరిస్థితి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుంటూ బతుకుతున్నారు.

Chandrababu Speak With Telugu Students Stranded In Ukraine

Chandrababu Speak With Telugu Students Stranded In Ukraine

యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం జగన్ సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు జగన్ ఫోన్ చేశారు. యుక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జగన్ తో చెప్పారు కేంద్రమంత్రి జైశంకర్. ఉక్రెయిన్ పొరుగున ఉన్న దేశాల మీదుగా ప్రత్యేక విమానాల్లో అందరినీ తీసుకొస్తామని ఆయన తెలిపారు.

ఉక్రెయిన్ లోని తెలుగు వారి తరలింపుపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని జిల్లా కేంద్రాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న తెలుగువారి నుంచి సమాచారం వస్తే విదేశాంగ శాఖకు తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ, సీఎంఓ అధికారులు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

వరుసగా రెండో రోజూ యుక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. దాదాపు ఉక్రెయిన్ నట్టింట్లోకి వెళ్లి యుద్ధం చేస్తున్న రష్యా… పొరుగు దేశాన్ని బాంబులతో మోతెక్కిస్తోంది. రష్యా ఆయుధ సంపత్తి గురించి తెలిసిన వాళ్లకు ఈ యుద్ధం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా అనిపిస్తుంది. రష్యా దగ్గరున్న ఆయుధాల్లో కొన్ని అగ్రరాజ్యం అమెరికా దగ్గర కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే, ఉక్రెయిన్ పై దాడికి రష్యా మధ్యశ్రేణి ఆయుధాలనే వినియోగిస్తోందని తెలుస్తోంది.

Ukraine Tension : యుక్రెయిన్‌లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ

ముఖ్యంగా, కల్బీర్ క్రూయిజ్ మిస్సైళ్లు, సికిందర్ వ్యూహాత్మక బాలిస్టిక్ మిస్సైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లు, స్మెర్చ్ రాకెట్లను ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ఉపయోగిస్తోంది. ఇవే కాకుండా, పదాతి దళాలకు వెన్నుదన్నుగా నిలిచే 75 ఫైటర్ జెట్లు, బాంబర్లను కూడా రంగంలోకి దించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పోరాటానికి మాత్రం 24 ఎంఐ-8 హెలికాప్టర్లను వాడుతోంది. అంతేకాదు, తన అమ్ములపొదిలోని కీలక యుద్ధ ట్యాంకులను కూడా యుక్రెయిన్ భూభాగంపైకి నడిపింది.

కేవలం ఉక్రెయిన్ లోని సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నట్టు రష్యా అధినాయకత్వం చెబుతున్నప్పటికీ, కీవ్ లోని కొన్ని థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.