Chandrababu : ఏపీ సీఎం తెలంగాణ సీఎంలా కాదు .. అందుకే తెలంగాణ అభివృద్ధి చెందింది : చంద్రబాబు

హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కేసీఆర్, తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో అందుకే తెలింగాణ అభివృద్ధి చెందింది అని అన్నారు.

Chandrababu : ఏపీ సీఎం తెలంగాణ సీఎంలా కాదు .. అందుకే తెలంగాణ అభివృద్ధి చెందింది : చంద్రబాబు

chandrababu In Hyderabad TDP office

chandrababu In Hyderabad TDP office : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్ లో ని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. 14వ సారి పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత మొదటిసారి ట్రస్ట్ భవన్ కు వచ్చారు. టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉండటం నా అదృష్టం అని అన్నారు. అలనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీని హైదరాబాద్ లో పెట్టారని.. టీడీపీ ఉన్నంత వరకు హైదరాబాద్ లో పార్టీ ఆఫీసు ఉంటుందని స్పష్టంచేశారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోని అభిమానులు ఉన్నారని.. నా తుది శ్వాస ఉన్నంత వరకు తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.

 

టీడీపీ వచ్చిన తరువాతనే తెలుగువారికి ఆత్మగౌరవం వచ్చిందన్నారు చంద్రబాబు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకపోయినా తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని అన్నారు. ఈరోజు తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అయిందంటే దానికి ఆరోజు టీడీపీ చేసిన అభివృద్ధి కారణం అని మరోసారి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ ముద్ర ఉందని..ప్రతి పేదవాడిని ధనికుడిగా చేయాలన్నదే టిడిపి లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తరువాత వచ్చిన సీఎం విధ్వంసం చేయలేదని అందుకే తెలంగాణ అభివృద్ది సాధ్యమైందని అన్నారు. కానీ ఏపీలో అలా కాదు..ఏపీ సీఎం విధ్వంసం చేస్తున్నాడు కాబట్టి ఏపీ పరిస్థితి అలా ఉందన్నారు.

 

Minister KTR : అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదన్నారు.. కారణం సీఎం కేసీఆర్ పాలనే..

 

ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు చంద్రబాబు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలమైన పార్టీగా చేసేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ లో ఎన్నికలు వస్తాయని… ఇప్పుడు నా బాధ్యత పెరిగిందని, విధ్వంసాల పాలనను అంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరు అని అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం కావటం ఖాయమన్నారు. చంద్రబాబు చేస్తున్న పనిలో మనం 1శాతం చేసినా మనల్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు.