కాలుష్యానికి చెక్ : BS – 4 వెహికల్స్ సంగతేంటి

  • Published By: madhu ,Published On : March 8, 2020 / 02:31 AM IST
కాలుష్యానికి చెక్ : BS – 4 వెహికల్స్ సంగతేంటి

కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కాలుష్యం వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు రవాణా శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పొల్యూషన్ నియంత్రించేందుకు అత్యంత శుద్ధి చేసిన బీఎస్ -6 పెట్రోలు, డీజిల్ వాహనాలు ఏప్రల్ 1 నుంచి రోడ్డుపై పరుగు పెట్టనున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న బీఎస్ – 4 వాహనాలను వదిలించుకునేందుకు డీలర్లు ఆఫర్లు ప్రకటిస్తున్నారు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనలతో.. వాహన డీలర్లు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మార్చి 31 నుంచి పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ నిలిపివేయనుంది. దీంతో ఇప్పటికే ఉన్న వాహనాలను అమ్మేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా తీసుకువచ్చిన భారత్‌ స్టేజ్ ప్రమాణాల్లో బీఎస్-6 నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం ఉన్న బీఎస్-4 వాహనాలకు మార్చి 31 నుంచి రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ నిలుపివేయబోతుంది. ఆ లోపు రిజిస్టరైన వాటిని యథావిధిగా వినియోగించు కోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్-6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పటికే ఉన్న వాహనాలు నెల చివర్లోగా విక్రయించాల్సి ఉంటుంది.. లేనిపక్షంలో వాటిని బీఎస్-6 ప్రమాణాలకు తగినట్లు మార్చాల్సి ఉంటుంది. 

మార్చి 31 నాటికి బీఎస్-4 వాహనాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి. ఇక రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకుని తిప్పుతున్న వాహనాలు 2లక్షల 96 వేల 336 వరకు ఉన్నాయి. వీరంతా పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో అలాంటి వాహనాలను ఏప్రిల్ 1 తర్వాత అనుమతించ కూడదని నిర్ణయించారు. మొత్తానికి బీఎస్-6 ప్రమాణాలున్న వాహనాలు రానున్న క్రమంలో.. బీఎస్ 4 వాహనాలను అమ్మేందుకు.. కంపెనీలు ఆఫర్లు పెడుతూ వాటిని వదిలించుకోడానికి చూస్తున్నాయి. 

Read More : మాన్సాస్ మంటలు : సంచయిత ఆధార్ కార్డు పరిశీలించండి – అశోక్ గజపతి రాజు