Chicken : కొండపైన ‘కోడి’.. ధర ఎంతంటే

చికెన్, గుడ్లు తింటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో వీటిని కొనుక్కోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. వీటి వినియోగం అమాంతం పెరగడంతో వ్యాపారులకు...

Chicken : కొండపైన ‘కోడి’.. ధర ఎంతంటే

chicken

Chicken Prices Soar High : కోడి మాంసం ధర పైకి ఎగబాకుతున్నాయి. ఎండకాలం ప్రారంభం నుంచే ధరలు తగ్గుతుంటాయి. కానీ.. అందుకు విరుద్ధంగా వారం రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. 2022, ఫిబ్రవరి 21వ తేదీన రూ. 222 ధర ఉంటే.. ఫిబ్రవరి 27వ తేదీ అమాంతం రూ. 270కి ఎగబాకింది. దీంతో కిలో కొనుక్కొనే వారు అరకిలోకు పరిమితమవుతున్నారు. వారం రోజుల వ్యవధిలో రూ. 50 వరకు పెరగడం గమనార్హం. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరలు పెరుగదలకు కారణమని అంటున్నారు.

Read More : Banana : చర్మ,జుట్టు సౌందర్యానికి అరటిపండు మేలు!…

కరోనా వైరస్ ఉధృతి కారణంగా చికెన్, గుడ్లు తింటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో వీటిని కొనుక్కోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. వీటి వినియోగం అమాంతం పెరగడంతో వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ.. ప్రస్తుతం ధరలు పెరగడంతో మాంసం కొనుక్కోనే వారు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు.

Read More : Ovarian Cancer : మహిళల్లో అండాశయ క్యాన్సర్…ఈ సంకేతాలుంటే జాగ్రత్త

21వ తేదీ రూ. 222
22వ తేదీ రూ. 228
23వ తేదీ రూ. 236
24వ తేదీ రూ. 244
25వ తేదీ రూ. 250
26వ తేదీ రూ. 260
27వ తేదీ రూ. 270