పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిషేధం..నిర్వహిస్తే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు

పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిషేధం..నిర్వహిస్తే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు

Chicken races are banned in West Godavari : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేల నిర్వహణపై పోలీసులు నిషేధం విధించారు. పండుగ సమయంలో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి ఆటలపై పోలీసులు నిషేధం విధించారు. ఎవరైతే కోడి పందాలు నిర్వహిస్తారో వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఫంక్షన్ హాల్స్, తోటలు వంటి ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తే వాటి యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు ఉపయోగించే సుమారు 9 వేల 600 కోడికత్తులను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు 11 వందల కేసులు నమోదు చేసిన పోలీసులు… 4 వేల 159 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోడిపందేలు నిర్వహిస్తే నిర్వాహకులు, స్థల యజమానులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రజా ప్రతినిధులపై పందెం రాయుళ్లు ఒత్తిడి చేస్తున్నారు. నిర్వాహాకులు కూడా మరికాసేపట్లో కోడి పందేలు ప్రారంభమవుతాయని పందెం రాయుళ్లకు భరోసా ఇస్తున్నారు.