Chicken Races : కోనసీమలో.. కోడి ఢీ అంటే ఢీ

లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధులు, వాళ్ల అనుచరులు పండగ మొదటి రోజు దగ్గరుండి కోళ్ల పందాలు ఆడించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ 250 దాకా బరులు ఏర్పాటు చేశారు.

Chicken Races : కోనసీమలో.. కోడి ఢీ అంటే ఢీ

Kodi

Chicken races in Godavari districts : కోనసీమలో.. కోడి ఢీ అంటే ఢీ అంటోంది. గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండు జిల్లాల్లో.. భారీగా కోళ్ల పందాల బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి వ్యాప్తంగా.. 350 పైనే బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. పెద్ద బరుల్లో.. లక్ష నుంచి 10 లక్షల దాకా పందాలు వేస్తున్నారు. చిన్న బరుల్లో.. 5 వేల నుంచి 50 వేల దాకా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధులు, వాళ్ల అనుచరులు పండగ మొదటి రోజు దగ్గరుండి కోళ్ల పందాలు ఆడించారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ 250 దాకా బరులు ఏర్పాటు చేశారు. పందాల దగ్గర డబ్బులు లెక్కించేందుకు.. క్యాష్ కౌంటింగ్ మెషీన్లు కూడా పెట్టుకున్నారు నిర్వాహకులు. ఆన్‌లైన్‌‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు.. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌లు కూడా అందుబాటులో ఉంచారు. పండగ తొలిరోజే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 350 కోట్లకు పైనే బెట్టింగ్‌లు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

School Holidays : కరోనా ఎఫెక్ట్.. మరో రెండు వారాలపాటు బడులు బంద్‌..?

చాలా మంది ప్రజాప్రతినిధులు.. సొంత జిల్లాలను వదిలి.. కోళ్ల పందాల కోసమే.. కోనసీమకు వెళ్లారు. వీఐపీలు, ధనవంతులు.. కోళ్ల పందాలు చూసేందుకు.. కార్లలో కొబ్బరి చెట్ల కిందకొచ్చేశారు. కోళ్ల మధ్య జరిగే యుద్ధాన్ని తిలకించేందుకు.. గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక.. కోడి పందాల బరుల దగ్గరే భారీగా పేకాట, గుండాట కూడా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోనూ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు లక్షల రూపాయలు చేతులు మారాయి. కోడి పందాలను కంట్రోల్ చేయలేక.. పోలీసులు చేతులెత్తేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.