Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌

బాలుడి తండ్రి రాధేశ్యాం... వేదిక్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. తల్లి కూడా విద్యావంతురాలే. ఇద్దరూ విద్యావంతులై ఉండి కూడా... బాల్య వివాహాన్ని జరిపించారు.

Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌

Child Marrage

Child marriage : తిరుపతిలో బాల్య వివాహం కలకలం చెలరేగింది. తిరుపతి నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో.. అందరూ కలిసి బాల్య విహహం జరిపించారు. 16ఏళ్ల అబ్బాయికి.. పదేళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేశారు. వధువు, వరుడూ ఇద్దరూ మైనర్లే. అయినా ఏకంగా రాఘవేంద్ర స్వామి మఠంలోనే మైనర్ల పెళ్లిని దర్జాగా జరిపించారు.

బాలుడి తండ్రి రాధేశ్యాం… వేదిక్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. తల్లి కూడా విద్యావంతురాలే. ఇద్దరూ విద్యావంతులై ఉండి కూడా… బాల్య వివాహాన్ని జరిపించారు. బాల్య వివాహాలు ఎవరైనా జరిపితే ఆపాల్సిన విద్యావంతులు.. ఏకంగా తమ కుమారుడికి.. మైనర్‌తో పెళ్లి జరిపించడం చర్చనీయాంశంగా మారింది.

Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..

తమ కుమారుడి వివాహాన్ని ఒకటి కాదు.. రెండు కాదు…. ఏకంగా ఐదు రోజులపాటు పాటు చేశారు. పూర్వ సంప్రదాయ పద్ధతిలో బంధువులను పిలిచి మరీ పెళ్లి జరిపించారు. ఐదు రోజులపాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లిని అత్యంత రహస్యంగా జరిపించారు.

పెళ్లైన తర్వాత… ఈ విషయం బయటకు పొక్కడంతో… జిల్లా చైల్డ్‌ ప్రొటక్షన్‌ అధికారి శివకుమార్‌ అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం కింద నలుగురిపైనా పోలీసులు కేసు పెట్టారు.