చైనా టు ఇండియా : ఢిల్లీకి చేరుకున్న కరీంనగర్ జ్యోతి

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 10:05 AM IST
చైనా టు ఇండియా : ఢిల్లీకి చేరుకున్న కరీంనగర్ జ్యోతి

కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరుకోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు వద్ద వీరికి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలు లేకపోతే..వారి వారి స్వగ్రామాలకు తరలిస్తారు. ముందుగా తాను ఇండియాకు వస్తున్నట్లు జ్యోతి కుటుంబసభ్యులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చైనాలో చిక్కుకపోయిన భారతీయులు బిక్కుబిక్కుమంటు గడిపారు. వీరిని సురక్షితంగా దేశానికి తీసుకరావాలని వారి కుటుంబసభ్యులు కోరారు. దీంతో ఇటీవలే..రెండు ఎయిరిండియా విమానాలు అక్కడకు వెళ్లాయి. పలువురిని తీసుకొచ్చారు. కానీ జ్యోతిని మాత్రం తీసుకరాలేదు. ఆమెకు కరోనా వైరస్ సోకిన లక్షణాలున్నాయని విమాన సిబ్బంది నిరాకరించారు.

తనకు జ్వరం మాత్రమే ఉందని, కరోనా వైరస్ లేదని ఆమె సెల్ఫీ వీడియోలో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఏపీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. దీంతో జ్యోతి ఢిల్లీలో క్షేమంగా అడుగుపెట్టారు. నిబంధనల ప్రకారం…14 రోజలు పాటు వీరు నిర్భందంలో ఉంటారు. ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన జ్యోతి ట్రైనింగ్ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లింది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఆమె అక్కడే చిక్కుకపోయింది. చివరకు ఆమెకు కరోనా లేదని తెలియడంతో.. భారత్ కు తీసుకు వచ్చారు. 

మరోవైపు..కరోనా వైరస్ ద్వారా మరణించిన వారి సంఖ్య 2 వేల 700కు చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 80 వేలు దాటినట్లు అంచనా. కరోనా వైరస్ చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్‌కొరియాలో విజృంభించడం ప్రారంభమైంది. మరోవైపు అమెరికాలోని మోడెర్నా అనే బయోటెక్ సంస్థ కరోనాకి వేక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. 
 

Read More>>ముందుకా వెనక్కా : రోడ్డుపై కూర్చొన్న బాబు