Fraud At East Godavari : చిట్టీల పేరుతో అమాయకుల నుంచి రూ.5 కోట్లు దోచుకున్న కేటుగాడు.

నమ్మి చిట్టీలు కడితే నట్టేట ముంచాడో వ్యక్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసి ఐపీ పెట్టాడు.

Fraud At East Godavari : చిట్టీల పేరుతో అమాయకుల నుంచి రూ.5 కోట్లు దోచుకున్న కేటుగాడు.

Fraud At East Godavari

Fraud At East Godavari : నమ్మి చిట్టీలు కడితే నట్టేట ముంచాడో వ్యక్తి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను పేద మధ్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసి ఐపీ పెట్టాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని కే గంగవరం పట్టణానికి చెందిన కర్రీ వీరాంజనేయ భైరవస్వామి అలియాస్ అంజి చిట్టీల నిర్వాహకుడు. గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. తన వద్ద చిట్టీలు వేసిన వారికి సమయానికి డబ్బులు ఇస్తూ నమ్మకం పెంచుకున్నారు. ఆ తర్వాత తన అసలు రంగు బయటపెట్టాడు.

చదవండి : East Godavari : పోలీసు, ఉద్యోగుల కళ్లలో కారం కొట్టిన మహిళా రేషన్ డీలర్

చిట్టీలు వేసిన పేద, మధ్యతరగతి ప్రజలకు డబ్బు ఇవ్వకుండా తిప్పుకునేవాడు. ఆలా నెలలు గడిచాయి. ప్రజలు తిరగబడి కొడతారనే భయంతో కోర్టుకు వెళ్లి.. ఐపీ తెచ్చుకున్నాడు. దీంతో అంజి తమను మోసం చేశాడంటూ చిట్టీలు కట్టినవారు లబోదిబో అంటున్నారు. తన వద్ద చిట్టీలు కట్టిన దాదాపు 200 మందిని మోసం చేసినట్లుగా తెలిసింది.

చదవండి : East Godavari : గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

ముందస్తు చర్యల్లో భాగంగా తనకు ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు అంజి. 116 మంది చిట్టీ బాధితులకు ఐపీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారులు స్పందించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చిట్టీదారులు కోరుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ చిరంజీవి విచారణ ప్రారంభించారు.