Love Harassment : నర్సు గొంతు కోసి..చంపిన యువకుడు..రాళ్లతో కొట్టి చంపిన బంధువులు

మరో ప్రేమోన్మాది ఘాతుకానికి నర్సుగా పనిచేసే యువతి బలైపోయింది. సుస్మిత అనే యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు చిన్నా అనే వ్యక్తి. నిన్ను ప్రేమించట్లేదని సుస్మిత ఎంతగా చెప్పినా వినకుండా చిన్నా ఆమెను వేధిస్తునే ఉన్నాడు. ఈక్రమంలో తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో విచక్షణ మరచిపోయిన చిన్నా సు స్మిత ఇంటికెళ్లి నిద్రిస్తున్న ఆమె గొంతు కోసం హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకున్నాడు.

Love Harassment : నర్సు గొంతు కోసి..చంపిన యువకుడు..రాళ్లతో కొట్టి చంపిన బంధువులు

West Godavari Sara Merchant Murder In Ap

Love Harassment : ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరో ప్రేమోన్మాది ఘాతుకానికి నర్సుగా పనిచేసే యువతి బలైపోయింది. నర్సుగా పనిచేస్తున్న సుస్మిత అనే యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు చిన్నా అనే వ్యక్తి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదని ఆమె ఎంతగా చెప్పినా వినకుండా వేధిస్తునే ఉన్నాడు. ఈక్రమంలో తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో విచక్షణ మరచిపోయిన చిన్నా సుస్మిత ఇంటికెళ్లి నిద్రిస్తున్న ఆమె గొంతు కోసం హతమార్చాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకున్నాడు.

చిత్తూరులోని ఓ హాస్పిటల్ లో సుస్మిత స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆమెను ప్రేమపేరుతో చిన్నా అనే వ్యక్తి కొంతకాలంగా వేధిస్తున్నాడు. కానీ సుస్మిత నేను నిన్ను ప్రేమించట్లేదని దయచేసి నా వెంట పడొద్దని చాలాసార్లు చెప్పింది. కానీ చిన్నా వినలేదు. వేధింపులు తీవ్రం చేశాడు. దీంతో సుస్మిత గత రెండు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించి తన పరిస్థితి చెప్పుకుంది. సరే మేం అతనికి బుద్ది చెబుతాం అని పోలీసులు అన్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చిన్నా మరింతగా రెచ్చిపోయాడు.ఎంతగా వెంటపడ్డా పట్టించుకోవట్లేదని సుస్మితపై పగ పెంచుకున్న చిన్నా నేరుగా సుస్మిత ఇంటికెళ్లాడు. అప్పటికి ఆమె డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి పడుకుని ఉంది. అలా నిద్రిస్తున్న ఆమె గొంతు కోసి హతమార్చాడు చిన్నా. అనంతరం అతను కూడా గొంతు కోసుకున్నాడు.

ఈ ఘటన వారి ఇంట్లోనే కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఈ హఠాత్ ఘటననుంచి తేరుకున్న సుస్మిత తల్లిదండ్రులు గొంతు కోసుకుని అక్కడే పడి కొట్టుకుంటున్న చిన్నాను చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అంతే ఓ బండరాయి తెచ్చి అతనిని చావగొట్టారు. దీంతో ఘటనాస్థలంలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. సుస్మిత ఇంటిలోనే ఇద్దరూ నెత్తురు మడుగులో కొట్టుకుని ప్రాణాలు విడిచారు. దీంతో సుస్మిత ఇల్లంతా రక్తం పారింది. కాగా పోలీసులు చిన్నాపై చర్యలు తీసుకున్నారో లేదో అనే విషయం మాత్రం తెలియలేదు. ఒకవేళ చర్యలుతీసుకుని ఉంటే ఇంత ఘాతుకం జరిగి ఉండేది కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.