రూ.8 కోట్ల సెల్ ఫోన్ల కంటైనర్ చోరీని చేధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

  • Published By: murthy ,Published On : October 1, 2020 / 04:30 PM IST
రూ.8 కోట్ల సెల్ ఫోన్ల కంటైనర్ చోరీని చేధించిన చిత్తూరు జిల్లా పోలీసులు

చిత్తూరు జిల్లా నగరి వద్ద చోరీకి గురైన రూ.8 కోట్ల విలువైన సెల్ ఫోన్లను చిత్తూరు జిల్లా పోలీసులు దాదాపు నెల రోజుల వ్యవధిలో రికవరీ చేయగలిగారు. దోపిడీ చేసిన మధ్య ప్రదేశ్ కు చెందిన కంజర్ భట్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు కేసును చేధించి మొత్తం సెల్ ఫోన్లను రికవరీ చేయగలిగారు.

చోరీ జరిగింది ఇలా
25-08-2020 వ తేది రాత్రి 8.40 గం.ల సమయం లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నందు గల Flex Tronics Company నుండి XIAOMI మొబైల్ ఫోన్ల లోడ్ ను డ్రైవర్ ఇర్ఫాన్ MH 04 HD 6477 నెంబరు గల కంటైనర్ లో భివాండిలో డెలివరీ ఇవ్వటానికి బయలు దేరాడు. దారిలో తిరుత్తణి RTO చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి మండల  పరిధిలోకి ప్రవేశించాడు.nagari cell phones theft నగరి బోర్డర్ దాటిన తర్వాత మూడు లారీ లలో గుర్తు తెలియని దుండగులు వెంబడిస్తూ అందులోని Eicher Vehicle సెల్ ఫోన్ లారీ ని ఓవర్ టేక్ చేసుకుని ముందుకు వెళ్లిమొబైల్ ఫోన్లు ఉన్న కంటైనర్ ముందు నిలిపారు.

డ్రైవర్ ను అడ్రెస్స్ అడిగే నెపంతో, నటిస్తుండగా …… వెనుక లారీలో ఉన్న దుండగులు బలవంతంగా కంటైనర్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని  ఎంటరయ్యారు.  డ్రైవర్ని కొట్టి, కొద్ది దూరం కంటైనర్ ని తీసుకుని వెళ్లారు. కంటైనర్ లో ఉన్న సెల్ ఫోన్లను తమ వాహనాల్లోకి మార్చుకుని దోచుకొని వెళ్లిపోయారు.

దర్యాప్తు ప్రారంభం 
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ దోపిడీపై నగరి అర్బన్ పోలీసు స్టేషన్ లో కేస నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాధమిక స్దాయిలో ఎటువంటి ఆధారాలు దొరక్కుండా దుండగులు జాగ్రత్తలు వహించటంతో పోలీసులుకు కేసును చేధించటం కత్తి మీద సాము లాగా మారింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కేసున చేధిచేందుకు 3 బృందాలను ఏర్పాటు చేశారు.

3 టీమ్ లు ఏర్పాటు చేసిన ఎస్పీ సెంథిల్ కుమార్ 
చిత్తూరు జిల్లా బోర్డర్ నుం బంగ్లాదేశ్ బోర్డర్ వరకు ఈ బృందాలు ఆపరేషన్ నిర్వహించాయి. ఒక టీమ్ జాతీయ రహదారిపై లారీ వెళ్లిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫటేజి లు సేకరించి వాటిని విశ్లేషించుకుంటూ ముందుకు సాగింది.

మరోక టీం సెల్ ఫోన్లు దొంగతనం చేసే ముఠాల వివరాలు సేకరించి వారు ఏ ప్రాంతంవారో తెలుసుకుని ఆయా రాష్ట్రాలకువెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించింది. మరోక టీం నేపాల్, బంగ్లాదేశ్ ల సరిహద్దులు దాటిన వాహనాలు వివరాలు సేకరించే పనిలో పడింది.ctr sp mobile phones 3మధ్యప్రదేశ్ కంజర్ భట్ ముఠా పనే…
మొత్తానికి లారీలు వెళ్ళిన దారిలో సెల్ ఫోన్ లు దొంగిలించుకు పోయిన వాహనాల రిజిష్ట్రేషన్ నెంబర్లు ఆధారంగా వాటి యజమానులను గుర్తించారు. అవి వెళ్లిన రూట్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళారు. మధ్యప్రదేశ్ లోని దోపిడీ దొంగల ముఠాల వివరాలు సేకరించారు.

ఇది కంజర్ భట్ బందిపోటు దొంగల ముఠా పనిగా తెలుసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా మొదలగు రాష్ట్రాలలో హై వే పై దొంగతనాలు చేస్తుంటారు. వీరిపై మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి.ctr sp mobile phones 2మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించి మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని దేవాస్ జిల్లా థానేఘాటి గ్రామం నందు కంజరభట్ ముఠా సభ్యులపై 29.09.2020 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసారు.

అరెస్ట్ చేసిన వారిలో రోహిత్ జల్లా (22) అంకిత్ ఝంజా (25) రామ్ గడే (25) ఉన్నారు. వీరి ద్వారా అడవిలో దాచి పెట్టిన 8 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటితో సహా నిందితులను పీటీ వారంట్ పై చిత్తూరు తీసుకువచ్చారు.