చిత్తూరు మహిళ అమెరికాలో ఆత్మహత్య

10TV Telugu News

Chittoor district women Commits Sucide:అమెరికాలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రేమలత (28) ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత.. అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్‌ నాయుడును 2016లో పెళ్లి చేసుకుంది. 2017లో సుధాకర్‌ దంపతులు అమెరికా వెళ్లగా.. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు గీతాంష్‌ ఉన్నాడు.మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. అయితే ప్రేమలతది ఆత్మహత్య కాదని సుధాకర్‌ హత్య చేసి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుధాకరే.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ప్రేమలత మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి భర్త నిరాకరిస్తుండగా.. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.