‘నేను శివుడ్ని..నా గొంతులో హాలాహలం ఉంది..కరోనా నన్నేమీ చేయలేదు’ : మదనపల్లి హత్యల కేసులో పోలీసులకు షాకులిస్తున్న తల్లి

‘నేను శివుడ్ని..నా గొంతులో హాలాహలం ఉంది..కరోనా నన్నేమీ చేయలేదు’ : మదనపల్లి హత్యల కేసులో పోలీసులకు షాకులిస్తున్న తల్లి

 chittoor: madanapalle twin murders case..Twist :  ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనంరేపిన అలేఖ్య, దివ్యల హత్యకేసులో మృతుల తల్లిదండ్రులను మంగళవారం (జనవరి 26,2021) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి కరోనా టెస్టులు చేయటానికి యత్నిస్తుండా ఈ కేసులో ఏ1 నిందితురాలు అయి తల్లి పద్మజ పోలీలకు షాకులమీద షాకులిచ్చింది. కరోనా టెస్టులు చేయించటానికి సాంపిల్స్ తీసుకునేందుకు యత్నిస్తుంటే నానా తిప్పలుపెట్టింది.

‘ నేను శివుడ్ని హాలాహలం మింగాను…ఈ కరోనా నన్నేం చేస్తుంది?’ కరోనాను పోగొట్టేది నేనే..నా బాబీ పార్టుల నుంచి కరోనాను పుట్టించాను.. అంటూ వింతగా ప్రవర్తిస్తూ..పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. పోలీసులు ఆమెకు సర్ధి చెప్పటానికి యత్నిస్తుంటే ‘డోంట్ టచ్ మీ’అంటూ పోలీసుల్నే గద్దించింది. నేను పరమశివుడ్ని నన్ను ముట్టుకోవటానికి మీరెవరు? దూరంగా పొండి అంటూ గట్టి గట్టిగా అరిచింది.

కలియుగంలో చెత్త బాగా పేరుకుపోయింది. ఆ చెత్తను ఏరివేసేందుకు భూమ్మిదకు కరోనాను పంపించాను. నేను శివుడిని నా గొంతులో హాలాహలం ఉంది..నాకు కరోనా పరీక్షలు చేయటమేంటి? అంటూ పిచ్చి పీక్స్ లోకి చేరగా అరుస్తూ నానా హంగామా చేసింది.

ఆమెను అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఏమాత్రం అదరలేదు..బెదరలేదు. దర్జాగా బైటకొచ్చింది. ఆ సమయంలో పద్మజ ‘చేతులు గాల్లోకి తిప్పుతూ..ఏంటేంటో మాట్లాడింది. అది చూసిన పోలీసులు తెల్లబోయారు. కరోనా టెస్టులు చేయించుకోవటానికి ఆమె నిరాకరించటం..వింత వింతగా ప్రవర్తిస్తు పెద్ద పెద్దగా కేకలు వేయటంతో ఇక చేసేది లేక పోలీసులు ఆమెకు కరోనా పరీక్షలుచేయించకుండానే తీసుకెళ్లారు.

‘నా పిల్లలు చనిపోయారని మీరు అనుకుంటున్నారు. కానీ నా బిడ్డలిద్దరూ రేపటిలోగా బ్రతికి వస్తారంటూ పిచ్చి, పిచ్చిగా మాట్లాడింది. పూజ గదిలోకి బూట్ల తో వెళ్ల వద్దంటూ వాదనకు దిగింది. కూతుళ్లను దారుణంగా హత్య చేశామనే పశ్చాత్తాపం ఆమెలో ఏకోశానా కనిపించలేదు. కానీ పద్మజ భర్త పురుషోత్తం నాయుడులో కాస్త బాధ కనిపించినా.. ఆమె మాత్రం దర్జాగా వెళ్లి పోలీసుల వాహనంలోకి వెళ్లి కూర్చుంది. ఇద్దరు కూతుళ్లను మూఢత్వంతో చంపినందుకు వారిని అరెస్టు చేసి హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తంనాయుడు ఏ1, తల్లి పద్మజ ఏ2గా పేర్కొన్నారు.. నిందితులను మదనపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

https://youtu.be/SNI4hbIID5U