US Mayor : అగ్రరాజ్యం అమెరికాలో మేయర్‌గా చిత్తూరు వాసి…

అమెరికాలో మరో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో డైల్‌హై మేయర్‌గా చిత్తూరు జిల్లా వాసి ఎన్నికయ్యారు.

US Mayor : అగ్రరాజ్యం అమెరికాలో మేయర్‌గా చిత్తూరు వాసి…

Chittoor Resident Becomes Mayor In Usa

Chittoor Resident Mayor : అమెరికాలో మరో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో డైల్‌హై మేయర్‌గా చిత్తూరు జిల్లా వాసి ఎన్నికయ్యారు. జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సముద్రాల బాబురావు తనయుడు సుధీర్‌ ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుధీర్.. భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు.

సముద్రాల సుధీర్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా బంధువులు బుచ్చినాయుడు కండ్రిగలో బాబురావు నివాసం వద్ద కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ నగరానికి సుధీర్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం బుచ్చినాయుడు కండ్రిగ గ్రామానికి, తెలుగువారికి, తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణమన్నారు. భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి సుధీర్ భారతదేశ ఔన్నత్యాన్ని చాటారంటూ కొనియాడారు.