తల్లీ కూతుళ్లతో సహజీవనం : ఒకరిని మెడలో రాళ్లు కట్టి ప్రాజెక్టులో పడేసి..మరొకరి మెడకు చీర చుట్టి ముళ్లకంపలకు కట్టి చంపేసిన దారుణం

తల్లీ కూతుళ్లతో సహజీవనం : ఒకరిని మెడలో రాళ్లు కట్టి ప్రాజెక్టులో పడేసి..మరొకరి మెడకు చీర చుట్టి ముళ్లకంపలకు కట్టి చంపేసిన దారుణం

Chittor mother, daughter deceased case accused arrest : ఏపీలోని చిత్తూరు జిల్లాలో తల్లీ, కుమార్తె హత్య కేసులో సోమవారం (ఫిబ్రవరి 1) నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండుకు తరలించారు. సహజీనం తల్లీ కూతుళ్ల హత్యలకు దారి తీసింది. కూతురిని చంపేసి ఓ ప్రాజెక్టులో పారేసి..శవం నీటి పైకి తేలకుండా మెడకు రాళ్లు కట్టేశాడు. అంతరం నా కూతురు ఏదని ప్రశ్నించిన తల్లిని కూడా చీరతో చంపేశాడు.

ఈ రెండు హత్యల కేసు గురించి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ..తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డిపల్లె పంచాయతీ ఏటిగడ్డ తాండాకు చెందిన గంగులమ్మ అనే 65 మహిళ, ఆమె కూతురు సరళ తో నిందితుడు మౌలాలి సహజీవనం చేసేవాడు. ముగ్గురు పిల్లలతో వారి పొలంలోని షెడ్డులో ఉండేవారు. ఈక్రమంలో సరళపై అనుమానం పెంచుకున్న మౌలాలి ఆమెను గత అక్టోబర్‌ 29న చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పెద్దేరు ప్రాజెక్టులో పడేశారు. అనంతరం మృతదేహం నీటి పైకి తేలకుండా మెడకు తాళ్లు కట్టి ఆ తాళ్లకు పెద్ద పెద్ద రాళ్లు కట్టి వదిలేశాడు.

కూతురు మూడు రోజులుగా కనిపించపోవడంతో గంగులమ్మ మౌలాలిని నిలదీసింది. నిజం చెప్పు నా కూతున్ని ఏం చేశావ్? చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదరించింది. దీంతో అసలు నిజం చెప్పాల్సి వస్తుందని భయపడ్డాడు. దీంతో ఆమెను కూడా చంపేస్తే అనే ఆలోచన వచ్చింది మౌలాలీకి. అలా గంగులమ్మ నిద్రపోతున్న సమయంలో ఆమె మెడకు చీర బిగించి చంపేశాడు. ఆ తరువాత గంగులమ్మ మృతదేహాన్ని కూడా మాయం చేశారు. అక్కడకు దగ్గరలో ఉన్న గంగచెరువులో పడేసి ఆమె శవం కూడా పైకి తేలకుండా చీరను కంపచెట్లకు కట్టేసి పైన పెద్ద బరువు పెట్టాడు.

మరుసటి రోజు పిల్లలు వారి అమ్మ, అమ్మమ్మ కనిపించడం లేదని మౌలాలీని అడిగారు. దీంతో వాళ్లకు కరోనా సోకిందని 15 రోజుల పాటు ఇంటికి రారని చెప్పాడు. ఆ తరువాత పిల్లలు అక్కడే ఉంటే విషయం బయటపడుందనుకుని ఆ పిల్లలను కర్ణాటకలోని గౌనుపల్లె తీసుకెళ్లి అక్కడే దాచిపెట్టాడు. రెండు హత్యలు చేశాడు గానీ లోలోపల మౌలాలీకి భయం వెన్నాడుతూనే ఉంది. నీటిలోంచి శవాలు ఎక్కడ పైకి తేలి తన గుట్టు రట్టు అవుతుందని భయపడుతుండేవాడు. అలా ఏటిగడ్డ తాండాకు వచ్చి మృతదేహాలు తేలాయో లేదో చూసి వెళ్లేవాడు. ఈ క్రమంలో సరళ ఫోన్‌ ఫోన్ చేసిన బంధువులు ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె బంధువుల ధనమ్మ ఏటిగడ్డ తాండాకు వచ్చింది. గంగులమ్మ,సరళలు కనిపించకపోవటంతో ధనమ్మకు అనుమానం వచ్చింది.

అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులను అడిగింది. మాకేమీ తెలీదని చెప్పారు. దీంతో భయపడిన ధనమ్మ తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ములకల చెరువు సీఐ సుకుమార్, ఎస్‌ఐ సహదేవి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మౌలాలితో సరళ సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆదివారం మౌలాలీని విచారించారు. దానికి అతను తడబడుతూ సమాధానాలు చెప్పేసరికి వెంటనే సోమవారం అదుపులోకి విచారించగా పొంతన లేని సమాధాలు చెప్పాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి..వాళ్లను ఎలా చంపాడో మొత్తం చెప్పాడు. దీంతో మృతదేహాల్ని వెలికి తీయగా అప్పటికే నీటిలో నానిపోయి ఉండటతో అవి బాగా కుళ్లిపోయి కనిపించాయి. వాళ్లు కట్టుకున్న బట్టలు, ఎముకల గూళ్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు పిల్లలు ముగ్గురు మైనర్లు కావడంతో బంధువులకు అప్పగించామని తెలిపారు.