సంక్రాంతి పండుగకు వస్తానన్నాడు..కానీ..వీరమరణం పొందాడు

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 10:50 AM IST
సంక్రాంతి పండుగకు వస్తానన్నాడు..కానీ..వీరమరణం పొందాడు

chittur army jawan died : దేశం కోసం వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామైన రెడ్డివారి పల్లి విషాదంలో మునిగిపోయింది. ఆయన 18 ఏళ్లుగా దేశ సేవలో ఉన్నారు. హవాల్దార్ గా పనిచేస్తున్నారు. ప్రత్యేక కమాండర్ గా శిక్షణ తీసుకుని…శత్రువులతో పోరాడి..ప్రాణాలను దేశం కోసం అర్పించాడు. ప్రతాప్ రెడ్డి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



మూడు రోజుల ముందు ఫోన్ చేశానని, దీపావళి పండుగకు వెళుతానని చెప్పానన్నారు. తన కొడుకుకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని, పోయిన సంవత్సరం జనవరి నెలలో వచ్చాడన్నారు. కరోనా కారణంగా..సెలవులు ఇవ్వలేకపోయారని, డాడీ ఎప్పుడొస్తాడు అంటూ..అడుగుతున్న పిల్లలకు ఏం సమాధానం చెప్పాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు.



మాకు ఏం పండుగలు ఏమున్నాయి ? జీవితాలు దండగా అయిపోయాయి..ఎంతో సరదగా ఉండే వాడు. దేశం కోసం వీరమరణం పొందాడు. ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ప్రతాప్ రెడ్డి బావమరిది చెప్పారు. దేశం కోసం వీరమరణం పొందిన ప్రతాప్ రెడ్డి పార్థివదేహం సోమవారం రాత్రి స్వగ్రామానికి రానుందని తెలుస్తోంది.



https://10tv.in/jawan-from-nizamabad-dist-among-4-killed-near-loc/
జమ్మూ-కశ్మీర్‌ మాచిల్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట జరిగిన ఎదురుకాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.