మాజీ మంత్రులకు సీఐడీ నోటీసులు.. న్యాయ నిపుణులతో చంద్రబాబు

మాజీ మంత్రులకు సీఐడీ నోటీసులు.. న్యాయ నిపుణులతో చంద్రబాబు

Cid Notices To Former Ministers Chandrababu With Legal Experts

రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వగా.. చంద్రబాబుతో పాటు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణకు, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నారాయణ హైదరాబాద్‌లో లేకపోవడంతో.. 23వ తేదీన విచారణకు రావాలని నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ హయాంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణ.

ఈ నోటీసులపై అత్యంత సన్నిహితులతో, న్యాయ నిపుణులతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. న్యాయనిపుణులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు.. అసలు సీఐడీ విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. నోటీసులపై కోర్టుకు వెళ్లే అంశాన్ని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు.

ఈ నోటీసులపై ఇప్పటి వరకూ చంద్రబాబు కానీ.. నారాయణ కానీ స్పందించలేదు. బాబు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.