చంపడానికైనా చావడానికైనా సై.. రెడ్ శాండల్ స్మగ్లింగ్.. స్టార్స్‌ మొదలు సెలబ్రిటీల వరకూ అనేకమంది పాత్రధారులు

  • Published By: naveen ,Published On : November 10, 2020 / 02:44 PM IST
చంపడానికైనా చావడానికైనా సై.. రెడ్ శాండల్ స్మగ్లింగ్.. స్టార్స్‌ మొదలు సెలబ్రిటీల వరకూ అనేకమంది పాత్రధారులు

red sandalwood smuggling: ఎర్రచందనాన్ని నరకడం, అమ్మడం, కొనడం నేరం. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయినా దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దర్జాగా కూలీలను పెట్టి మరీ దీన్ని నరికిస్తున్నారు. వక్ర మార్గాల్లో దర్జాగా దేశాన్ని దాటించేస్తున్నారు. కూలీల మొదలు బడా స్మగ్లర్ల వరకూ.. పొలిటీషియన్ల మొదలు పోలీసుల వరకూ.. స్టార్స్‌ మొదలు.. సెలబ్రిటీల వరకూ ఇందులో అనేక మంది పాత్రధారులు.! ఇందులో ఎప్పుడైనా చచ్చేంత ధైర్యముంది. ఎవరి పీకనైనా కోసేయగల సత్తా ఉంది. అందుకే ఇప్పుడు రెడ్‌ శాండల్‌ ఓ కథా వస్తువు.

కడప జిల్లాలో ఈ మధ్య ఓ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మొదట అందరూ దీన్నొక సాధారణ యాక్సిడెంటే అనుకున్నారు. కానీ దీని లోతుకు వెళ్లేకొద్దీ తెలిసింది దీని వెనుక బడా స్కెచ్ ఉందని..!




యాక్సిడెంట్‌తో మొదలైన అసలు కథ:
ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ కారు రోడ్డుపై వెళ్తోంది. దాన్ని ఓ గ్యాంగ్ మరో వాహనంలో వెంబడిస్తోంది. ఈ విషయం గమనించిన స్మగ్లర్ల వ్యాన్‌ పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే దాన్ని గమనించిన లోకల్ ముఠా ఆ వ్యాన్‌కు నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ఐదుగురు తమిళ కూలీలు సజీవ దహనమయ్యారు. దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఓ షాకింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. ఎర్రచందనం తరలించేందుకు కూలీలను మోహరించిందీ.. వాళ్లను చంపేందుకు లోకల్‌ ముఠాను పంపిందీ.. ఒకరేనని తేలింది. అది కూడా అంతర్జాతీయ స్మగ్లర్ బాషా అని నిర్ధారించుకున్నారు పోలీసులు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈ ట్విస్ట్‌ చాలా ఇంట్రస్టింగ్..!

చంద్రబాబుపై దాడికి నక్సలైట్లకు డబ్బు సమకూర్చింది స్మగ్లర్లే:
ఇంకో స్టోరీ చూద్దాం… చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో 2009లో ఆయనపై అలిపిరి దగ్గర నక్సలైట్లు దాడి చేశారు. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు నక్సలైట్లకు అవసరమైన డబ్బును రెడ్‌ శాండల్‌ స్మగ్లర్లే సమకూర్చారనే ఆరోపణలున్నాయి. ఇదీ ఎర్రచందనం సత్తా.!

సీన్‌లోకి సినీ, రాజకీయ ప్రముఖులు:
ఇప్పుడు మరో యాంగిల్‌ చూద్దాం… ఆ మధ్య ఓ సినీ నటి కర్నూలులో పోలీసులకు పట్టుబడింది. నిర్మాత, రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న ఓ రెడ్‌ శాండల్‌ స్మగ్లర్‌తో ఆమె సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈమెకు కూడా స్మగ్లింగ్‌తో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఎర్రచందనం ఎవరితోనైనా, ఎలాంటి పనులైనా చేయిస్తుందనేందుకు ఇదొక ఎగ్జాంపుల్.
https://10tv.in/police-arrest-red-sandalwood-smuggler-basha-bhai/
రాజకీయ నేతల అండదండలతో స్మగ్లర్ల బరితెగింపు:
ఎర్రచందనంలో పలువురు రాజకీయ నేతలకు కూడా ప్రమేయముంది. స్మగ్లర్లకు కొంతమంది పొలిటీషియన్లు కొమ్ముకాస్తున్నారు. స్మగ్లర్లు కొంతమంది రాజకీయ నేతలకు ఫండింగ్ చేస్తున్నారు. కొంతమంది రెడ్ శాండల్ స్మగ్లర్లు కొన్నిచోట్ల రాజకీయాలను శాసిస్తున్నారు. స్మగ్లర్లతో కొంతమంది పోలీసులు, ఫారెస్ట్ అధికారులు సత్సంబంధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పలువురు పోలీసు, అటవీశాఖాధికారులు ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు కూడా.




రెడ్‌ శాండల్‌ అంశంపై రూ.150కోట్ల బడ్జెట్ తో సినిమా:
రెడ్‌ శాండల్ ఇప్పుడొక సినిమా కంటెంట్. దీని నేపథ్యంగా అనేక సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి..! ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్‌లో 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పుష్ప అనే సినిమా తెరకెక్కుతోంది. రెడ్ శాండల్‌ అనేక అంశాలకు వేదిక. ఇందులో క్రైమ్ ఉంది. సస్పెన్స్ ఉంది. సెంటిమెంట్ ఉంది. అన్నిటికీ మించి ఇదొక సేలబుల్‌ సబ్జెక్ట్.