ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలు, అమ్మఒడికి 75శాతం హాజరు.. AP Cabinet కీలక నిర్ణయాలు

సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు వీలుగా...

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాలు, అమ్మఒడికి 75శాతం హాజరు.. AP Cabinet కీలక నిర్ణయాలు

Ap Cabinet

AP Cabinet : సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చించారు.

Diwali with Mi sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు

అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని.. మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది కొవిడ్ కారణంగా హాజరుకు మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు.

* విశాఖ మధురవాడలో అదానీ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
* 200 మెగా డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్కు కోసం 130 ఎకరాలను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం.
* ప్రకాశం జిల్లా వాడరేపు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం.
* ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
* 7 మెగావాట్ల సోలర్ పవర్ సప్లయ్ కు త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.
* బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్‌ ఆమోదం.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

* మావోయిస్టులు, అనుబంధ సంస్థలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగింపుపై ఆమోదం.
* వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలకు ఆమోదం.
* కొత్తగా 1,285 ఉద్యాగాల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్.
* అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, మెడికల్ కాలేజీల్లో 2,190 మంది నియామకానికి ఆమోదం.
* ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 26,917 ఉద్యోగాలిచ్చామన్న ప్రభుత్వం.