Pawan Kalyan: ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పౌరులు యాప్‌ను సిద్ధం చేస్తారు.. ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలుసైతం విద్యాశాఖ నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పుబడుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు.

Pawan Kalyan: ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పౌరులు యాప్‌ను సిద్ధం చేస్తారు.. ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ ..

pawan kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. కరోనా కారణంగా గతంలో బయోమెట్రిక్‌ విధానం రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నైజేషన్‌ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే పొందుపర్చాలనే నిబంధన విధించింది. ఉదయం 9గంటల వరకు ఖచ్చితంగా పాఠశాలకు వచ్చి హాజరు వేసుకోవాల్సిందే. లేకుంటే ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఫేస్ రికగ్నైజేషన్‌ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Teachers Face Recognition App : టీచర్లకు అటెండెన్స్ యాప్.. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? టీచర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ప్రతిపక్ష పార్టీలుసైతం విద్యాశాఖ నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పుబడుతున్నాయి. అంశంపై ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్టూన్ ను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి ఏపీలో ఉపాధ్యాయుల పరిస్థితిని తెలియజేశారు. ఉపాధ్యాయులంతా యాప్ సిగ్నల్స్ కోసం అంటూ అటూ తిరుగుతున్నట్లుగా ఈ కార్టూ న్ లో ఉంటుంది.

Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

ఈ కార్టూన్ లో స్కూల్ అటెండర్ మాట్లాడుతూ.. ’ పాపం రాగానే పిల్లలకు పాఠాలు చెప్పేవాళ్లు.. అదేదో యాపట.. దాని సిగ్నల్ కోసం చెట్టుకొకరు, పుట్టకొకరు అట్టా తిరుగుతున్నారు సార్’ అంటూ చెబుతున్నట్లుగా ఉంది. అంతేకాక పవన్ కళ్యాన్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులుకు ఒక రూల్, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఒక రూల్ నా అంటూ ప్రశ్నించారు. అదే తరహాలో పౌరులు కూడా ఒక యాప్ సిద్ధం చేస్తారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారో ట్రాక్ చేసేలా అది ఉంటుందని, బాధ్యత ఎప్పుడూ ఒకరికే ఉండకూడదు, అందరికీ అది ఉండాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.