NV Ramana: నేడు హైదరాబాద్‌కు ఎన్వీ రమణ.. స్వాగతం పలకనున్న కేసీఆర్!

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. నిన్న తిరుమలకు వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

NV Ramana: నేడు హైదరాబాద్‌కు ఎన్వీ రమణ.. స్వాగతం పలకనున్న కేసీఆర్!

Cji Justice Nv Ramana

CJI Justice NV Ramana:తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. నిన్న తిరుమలకు వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

ఇవాళ జస్టిస్‌ ఎన్వీ రమణ హైదరాబాద్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటల 40నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు సీజేఐ. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు సీజేఐ. రాజ్‌భవన్‌లో ఎన్వీ రమణకు స్వాగతం పలకనున్నారు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై.

రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు ఎన్వీ రమణ. ఎయిర్ పోర్ట్‌లో మంత్రులు మహమూద్ ఆలీ, కేటీఆర్, ఇంద్ర కరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ విజయ లక్ష్మి. సీఎస్ సోమేశ్ కుమార్ రమణకు స్వాగతం పలకనున్నారు.

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు హైకోర్టు న్యాయవాద వర్గాలు, ప్రభుత్వ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.