CJI NV Ramana Inaugurated Courts Complex : విజయవాడలో కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ..ఒకే భవనంలో 31 కోర్టులు

విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే ప్రశఆంత కుమార్, సీఎం జగన్ పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

CJI NV Ramana Inaugurated Courts Complex : విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే ప్రశఆంత కుమార్, సీఎం జగన్ పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

తొమ్మిదేళ్లుగా ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయవాడలోని కోర్టు కాంప్లెక్స్‌ పనులు ఎట్టకేలకు పూర్తై… సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించబడింది. విజయవాడ నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో సుమారు వంద కోట్ల రూపాయ‌ల వ్యయంతో తొమ్మిది అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు. సీజేఐ చేతుల మీద‌ుగా జ‌రిగే ప్రారంభోత్సవానికి సీఎం జ‌గ‌న్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయ‌ కోవిదులు హ‌జ‌రయ్యారు.

2013 మే 13నే ఈ భవన సముదాయానికి శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తి కావ‌టానికి 9సంవ‌త్సరాలు ప‌ట్టింది. చాలాకాలంపాటు నిర్మాణ పనునలు నత్తనడకన సాగటంతో ఇంత ఆలస్యం అయ్యింది. ముఖ్యంగా కరోనా వల్ల రెండున్నర సంవ‌త్సరాల‌కుపైగా నిర్మాణం నిలిచిపోయింది. అనంతం బిల్లుల చెల్లింపులు ఆల‌స్యం కావటం వల్ల కూడా పనులు ముందుకు సాగలేదు.

పలువురు న్యాయ‌వాదులు హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేయటం..న్యాయ‌స్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. అలా ఎట్టకేల‌కు 3.70ఎక‌రాల్లో తొమ్మిది అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. జిల్లాలోని 31 కోర్టుల‌ు ఒకేచోటకు చేరుతున్నందున క‌క్షిదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని న్యాయ‌వాదులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 in 

 

ట్రెండింగ్ వార్తలు