CJI NV Ramana : న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం : ఎన్వీ రమణ
ఏపీలోని విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని CJI జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసగిస్తూ..న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే..ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుందని కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీజేఐ జస్టిస్ పేర్కొన్నారు.

CJI NV Ramana : ఏపీలోని విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసగిస్తూ..న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే..ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుందని కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయని రమణ తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిగతగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను నా వంతుగా పూర్తి చేశానని వెల్లడించిన ఎన్వీ రమణ సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైనది ప్రజలకు న్యాయం అందించటంలో వారు కృషి చేయాలని సూచించారు. కేసుల వాదనలు విషయాల్లోను తీసుకోవాల్సిన పలు కీలక పాయింట్ల విషయాల్లో సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు సూచనలు ఇవ్వాలని వారి ప్రజలకు న్యాయం అందించే దిశగా ప్రోత్సహించాలని సూచించారు. విశాఖలో కూడా కొన్ని భవనాలు పూర్తి చేయాల్సి ఉందని ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ అక్కడే ఉన్న సీఎం జగన్ కు గుర్తు చేశారు.
తొమ్మిదేళ్లుగా ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయవాడలోని కోర్టు కాంప్లెక్స్ పనులు ఎట్టకేలకు పూర్తై… సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభించబడింది. విజయవాడ నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది అంతస్తుల భవనాన్ని నిర్మించారు. 2013 మే 13నే ఈ భవన సముదాయానికి శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావటానికి 9సంవత్సరాలు పట్టింది. చాలాకాలంపాటు నిర్మాణ పనునలు నత్తనడకన సాగటంతో ఇంత ఆలస్యం అయ్యింది. ముఖ్యంగా కరోనా వల్ల రెండున్నర సంవత్సరాలకుపైగా నిర్మాణం నిలిచిపోయింది. అనంతం బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావటం వల్ల కూడా పనులు ముందుకు సాగలేదు.
పలువురు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయటం..న్యాయస్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. అలా ఎట్టకేలకు 3.70ఎకరాల్లో తొమ్మిది అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. జిల్లాలోని 31 కోర్టులు ఒకేచోటకు చేరుతున్నందున కక్షిదారులకు మరింత సౌకర్యంగా ఉంటుందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.