Kia Motors: కియాలో గొడవలు.. ఇనుపరాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు

అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

10TV Telugu News

Kia Motors: అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. జూనియర్, సీనియర్ ఉద్యోగులు ఇనుప రాడ్లతో కొట్టుకున్నారు. ప్రధాన ప్లాంట్లో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు చోటుచేసుకుంటూ ఉండగా.. ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.

అయితే, జూనియర్లు.. సీనియర్లు మధ్య ఎంతోకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కియా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోవట్లేదని, ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం మిగిలిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. కియా ప్లాంట్‌లో ఉద్యోగులు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. లేటెస్ట్‌గా ఉద్యోగులు ఇనుపరాడ్లతో కొట్టుకోగా పరిస్థితి ఉద్రిక్తం అయ్యింది.

కియా పరిశ్రమలో గతంలో ఓ కన్సెల్టెన్సీ ద్వారా కొందరు ఉద్యోగులు సంస్థలో చేరగా.. కొంతకాలంగా వేరే కన్సెల్టెన్సీ ద్వారా పరిశ్రమలో ఉద్యోగులు చేరుతున్నారు. గతంలో కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినవారికి కొత్తవారికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లుగా గొడవలతో సంబంధంలేని ఉద్యోగులు చెబుతున్నారు.