ఏపీలో స్కూళ్లకు తాజా టైం టేబుల్

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 06:17 AM IST
ఏపీలో స్కూళ్లకు తాజా టైం టేబుల్

Class 8 students to attend school from November 23 : ఏపీలో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా నుంచి రక్షణ చర్యలు చేపడుతూ…పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్లో హాజరు శాతం పెరుగుతోంది. దీంతో మరిన్న జాగ్రత్తలు తీసుకొంటోంది విద్యాశాఖ. ఈ న ెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులు విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతుండగా..2020, నవంబర్ 23వ తేదీ సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.



8, 9 తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు పాఠాలను బోధిస్తుండగా..10వ తరగతి విద్యార్థులు మాత్రం ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SERT) తాజా టైమ్ టేబుల్ ను విడుదల చేశారు. 9వ తరగతి విద్యార్థులు సోమ, బుధ వారాల్లో 8వ తరగతి విద్యార్థులు మంగళ, గురు, శనివారాల్లో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభమౌతాయి. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30గంటలకు ఇళ్లకు పంపిస్తారు.



ఉదయం 9.30 నుంచి 9.45 వరకు కోవిడ్‌–19 ప్రతిజ్ఞ (తరగతి గదిలో).
9.45 నుంచి 10.25 వరకు మొదటి పీరియడ్‌.
10.25 నుంచి 10.35 వరకు ఆనంద వేదిక / భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాల ఆవరణలో నడవడం, చేతులు కడుక్కోవడం / మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.
10.35 నుంచి 11.15 వరకు రెండో పీరియడ్‌.
11.15 నుంచి 11.20 వరకు మంచినీటి విరామం (వాటర్‌ బెల్‌).
11.20 నుంచి 12.00 వరకు మూడో పీరియడ్‌.



https://10tv.in/visakha-police-busted-drugs-rocket-five-arrested/
12.00 నుంచి 12.10 వరకు ఆనంద వేదిక (కథలు చెప్పడం / చిత్రలేఖనం / పాఠ్యాంశాలకు సంబంధించిన నాటకీకరణ / చేతులు కడుక్కోవడం / ప్రాణాయామం, మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామం.
12.10 నుంచి 12.50 వరకు 10వ తరగతి విద్యార్థులకు నాల్గో పీరియడ్.
8/9వ తరగతి విద్యార్థులకు భోజన విరామం.
12.50 నుంచి 1.30 వరకు 8/9వ తరగతి విద్యార్థులకు నాల్గవ పీరియడ్.
10వ తరగతి విద్యార్థులకు భోజన విరామం



1.30 విద్యార్థులు ఇళ్లకు.
1.30 నుంచి 2 వరకు ఉపాధ్యాయుల భోజన విరామం.
2.00 నుంచి 2.15 వరకు ఆన్‌లైన్‌ బోధన, విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా సమాచారం అందించేందుకు ఉపాధ్యాయుల సమావేశం.



2.15 నుంచి 4.00 వరకు : వాట్సప్‌ / దూరదర్శన్‌ / దీక్షా / అభ్యాస యాప్‌ / యూట్యూబ్‌ / ఫోన్‌ ద్వారా సామూహిక సంభాషణ, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇవ్వడం వంటి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ.
4.00 నుంచి 4.15 వరకు మరుసటి రోజుకు ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం.