చీరాల వైసీపీలో వర్గపోరు..ఇళ్ల పట్టాల పంపిణీలో గొడవ

చీరాల వైసీపీలో వర్గపోరు..ఇళ్ల పట్టాల పంపిణీలో గొడవ

Conflict in distribution of house deeds : ప్రకాశం జిల్లా చీరాలలో అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా కరణం వర్గీయులపై మండిపడింది. రామాపురం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వివాదం తలెత్తింది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరణం బలరాం చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు సభా వేదికపై మాట్లాడారు. దీంతో రామారావు వ్యాఖ్యలపై పోతుల సునీత తీవ్ర అభ్యంతరం తెలిపింది. 2024 ఎన్నికల అభ్యర్థిని మీరు ఎలా డిసైడ్ చేస్తారని, అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో రామారావు, పోతుల సునీతను కరణం బలరాం మందలించారు. ప్రభుత్వ వేదికపై రాజకీయాలు ఎందుకని సముదాయించారు.

పోతుల సునీత, కరణం బలరాం వర్గాలు గొడవకు దిగాయి. 2024 లో మరోసారి కరణం బలరామే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారని తన అనుచరులైనటువంటి మాజీ మంత్రి పాలేరు రామారావుతోపాటు డాక్టర్ అమృతపాణి అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో స్టేజీపైనే ఉన్న పోతుల సునీత.. 2024లో పోటీ చేసే అభ్యర్థి ఎరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది దానికంటే ముందు మీరు అనౌన్స్ చేయడం తగదని వాగ్వాదానికి దిగారు.

అక్కడే ఉన్న పాలేటి రామారావు కచ్చితంగా కరణం బలరామే బరిలో దిగబోతాడని, ఇది కన్ఫాప్ అని చెప్పి ఎదురు సమాధానం చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పోతుల సునీత వారితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ వేదికపై రాజకీయాలు ఎందుకని కరణం బలరాం వారిద్దరినీ సముదాయించారు.